బరువు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా.? అందుకోసం రకరకాల డైట్స్, ఖఠినమైన వర్కౌట్స్ ను ఫాలో అవుతున్నారా.? అయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే.ఈ పొడిని ప్రతి రోజు తీసుకుంటే బరువు తగ్గడమే కాదు గుండె సురక్షితంగా కూడా ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్ కు ఉపయోగపడే ఆ పొడి ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల ఫూల్ మఖానా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో ఇరవై బాదం పప్పులు, నాలుగు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.చివరిగా ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానా, బాదం పప్పులు, అవిసె గింజలు, ఎండు కొబ్బరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

అంతే ఆ పొడిని ఒక డబ్బాలో నింపుకుని ఫిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు వారాల పాటు యూస్ చేసుకోవచ్చు.
ఈ పొడిని ఒక స్పూన్ చప్పున గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు ఉదయాన్నే తీసుకోవాలి.తద్వారా అందులో ఉండే పోషక విలువలు శరీరంలో కొవ్వును కరిగిస్తాయి.
మెటబాలిజం రేటును పెంచుతాయి.దాంతో వేగంగా బరువు తగ్గుతారు.
అంతేకాదు, పైన చెప్పిన పొడిని డైట్‌లో చేర్చుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఫలితంగా గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
