సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు కట్టుకొని హాయిగా జీవించాలని ఇది ఒక కలగా ఉంటుంది.ఈ కలను నెరవేర్చుకోవడం కోసం తమ శాయశక్తులా కష్టపడి పైసా పైసా కూడ పెట్టుకుని తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు.
అదేవిధంగా కొందరు ఆలయాలకు వెళ్లి తమ కలలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈ గుడిలో రాయి పై రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది.
ఈ విధంగా ఆలయ ప్రాంగణంలో రాయి రాయి పేర్చి దేవుడికి నమస్కరించడం వల్ల దేవుడికి గుడి కట్టినంత పుణ్యం లభిస్తుంది.మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదిగా చెప్పవచ్చు.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ వారికి కొంగుబంగారం చేస్తున్నారు.
ఈ ఆలయంలో స్వామివారు స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.పురాణాల ప్రకారం స్వామివారికి పరమ భక్తుడైన ప్రహ్లాదుడు స్వామి వారు రాతిస్తంభంలో ఉన్నారని చెప్పగా హిరణ్యకశిపుడుని సంహరించడానికి నరసింహ స్వామి స్తంభం నుంచి ఎంతో ఆగ్రహంతో బయటకు వచ్చి హిరణ్యకశిపుని సంహరించాడు.
ఈ విధంగా హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామి ఉగ్రరూపంలో ఉండగా స్వామి వారిని శాంతింప చేయటానికి ప్రహ్లాదుడు దేవతలందరూ కొలవడంతో స్వామివారు సింహగిరిపై వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.ఈ విధంగా సింహగిరిపై కొలువైన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో రాయి పై రాయి పేర్చి భక్తులు స్వామివారికి మొక్కడం వల్ల వారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది అని విశ్వసిస్తారు.ఈ ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా మనకు ఈ విధమైనటువంటి రాళ్లతో కట్టిన ఆలయాలు దర్శనమిస్తాయి.అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్లకు గుడ్డతో ఉయ్యాలలు కడితే వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
DEVOTIONAL