Vijyawada kanaka durga temple : రాహుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ప్రధానాలయం మూసివేత

ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ప్రధాన ఆలయం తో పాటు ఉపాలయాలు మూసివేత . గ్రహణ మోక్షకాలం అనంతరం సాయంత్రం 06-30 నిముషాలకు అమ్మవారి ప్రధానాలయము, ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు నిర్వహణ.

 Vijyawada Kanaka Durgamma Temple Closed Due To Rahu Garhasta Partial Lunar Ecl-TeluguStop.com

అనంతరం అర్చన, మహానివేదన, హారతి ఇచ్చి మరోసారి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేత … ఉదయం 8 గంటల లోపుగా ఉన్న సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం, నవగ్రహ శాంత్రి హోమం, రుద్రహోమంలు మాత్రమే భక్తులకు అనుమతి ఇచ్చిన ఆలయ అధికారులు.తర్వాత ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, శ్రీ చక్ర నవావరణార్చన, చండీహోమం, పంచ హారతులు, పల్లకీ సేవ మొదలైన సేవలన్ని రద్దు

రేపు ఉదయం యధావిధిగా అన్ని దర్శనములు, ఆర్జిత సేవలు పునః ప్రారంభం.

గ్రహణ సమయంలో నది ఒడ్డున జపాలు చేయడం ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే మంచిది.మేష రాశి అలాగే కొన్ని రాశుల వారు గ్రహణానంతరం దానాలు చేయడం వల్ల ఇబ్బందులు తొలుగుతాయి.

గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకపోవడం మంచిది.గ్రహణానంతరం విడుపు స్నానం చేసి దానాలు ఇవ్వాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube