ఈ దిశలో పిల్లలకు గదిని ఏర్పాటు చేస్తే ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడాల్సిందే..!

ప్రతి సమస్యకు పరిష్కారం వాస్తు శాస్త్రంలో( Vastu ) ఉంది అని పండితులు చెబుతున్నారు.ఎవరి ఇంట్లోనైనా వాస్తు ప్రకారం గదులు వస్తువుల అమరిక లేకుండా ఉంటే అప్పుడు ఇంట్లోనీ వారు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

 Vastu Tips Best Direction For Kids Room Details, Best Direction ,kids Room, Kid-TeluguStop.com

ముఖ్యంగా పిల్లలు( Kids ) ఆరోగ్యంగా లేకపోయినా తరచుగా అనారోగ్యం పాలైన అప్పుడు వాస్తు దోషం ఉన్నట్లు పరిగణించాల్సి ఉంటుంది.ఇంటిలో తూర్పు లేదా ఆగ్నేయ దిశలో పిల్లలకు నిద్రించే గదిని ఏర్పాటు చేయాలి.

అయితే అప్పుడే పుట్టిన శిశువుకు ఆగ్నేయం, ఈశాన్యం లేదా తూర్పు దిశలో గదులు ఏర్పాటు చేయడం మంచిది కాదు.పిల్లల గది దిశ( Kids Room ) సరిగ్గా లేకుంటే అప్పుడు వారు తరచుగా అనారోగ్యంతో బాధపడతారు.

కుమార్తె గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదు.అదే సమయంలో కొడుకు గది నీ పశ్చిమ దిశలో ఏర్పాటు చేసుకోవాలి.

పిల్లలు నిద్రపోయే మంచం తల తూర్పు వైపు ఉండాలి.ఇంట్లో పిల్లవాడు అనారోగ్యంతో ఉంటే వాయువ్య మూలలో నిద్రపోయేలా ఏర్పాటు చేయాలి.

Telugu Bed, Vastu, Cactus, Energy, Unhealthy, Vastu Tips-Latest News - Telugu

ముఖ్యంగా చెప్పాలంటే చెట్లు మొక్కలు( Trees ) శ్రేయస్సు కు చిహ్నాలు అని పండితులు చెబుతున్నారు.ఇంటి ప్రాంగణంలో చెట్లు మొక్కలు ఉంటే అవి ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించడానికి పనిచేస్తాయి.గుండ్రని ఆకారపు ఆకులు కలిగిన మొక్కలు శక్తి కోణంలో చాలా శుభప్రదమైనవి.అదే విధంగా ఇంట్లో పొడవైన నిటారుగా ఉండే ఆకులు కలిగిన మొక్కలు అంత శుభప్రదమైనవి కాదు.

అలాగే ఎవరైనా చిన్న మొక్కలను పెంచాలనుకుంటే ఇంటి తూర్పు దిశలో పెంచాలి.ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు.

Telugu Bed, Vastu, Cactus, Energy, Unhealthy, Vastu Tips-Latest News - Telugu

ఇంకా చెప్పాలంటే ఇల్లు లేదా కార్యాలయంలో కాక్టాస్ మొక్కలు( Cactus ) ఉంటే వాటిని తొలగించాలి.ఈ మొక్కలు ప్రతికూల శక్తిని ఇస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.పుష్పించే మొక్కలు శక్తిని అద్భుతంగా పెంచుతాయి.ప్రతి ఒక్కరి ఇంట్లో సానుకూల శక్తి, ప్రతికూల శక్తి అనే రెండు రకాల శక్తి ఉంటుంది.సానుకూల శక్తి శ్రేయస్సును ఇస్తుంది.ప్రతికూల శక్తి ఆనందం, శాంతిని దూరం చేస్తుందని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంటికి కిటికీలను సూర్యకాంతి ప్రవేశించేలా ఏర్పాటు చేసుకోవాలి.ఇది సానుకూల శక్తిని కలిగి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube