Bats worshiping : ఏపీలో వింత ఆచారం.. గబ్బిలాలను పూజిస్తే దోషాలు పోతున్నాయి?

ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్నా.కొన్నిచోట్ల మాత్రం పెద్దలు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

 People Worshiping Bats ,worshiping , Bats, Andra Pradesh, Chittoor District,  Ra-TeluguStop.com

మనకు అక్కడక్కడా పెళ్లిళ్లు, పూజలు, జాతరల్లో కొన్ని వింత ఆచారాలు కనిపిస్తుంటాయి.కొన్ని గ్రామాల ఆచార నియమాలు చూస్తే మనం కూడా నోరెళ్లబెట్టక తప్పదు.

ఎందుకు అంటే వారి ఆచార వ్యవహారాలు అంత విచిత్రంగా ఉంటాయి.అలా పెద్దలిచ్చి వెళ్లిన ఆచారాన్ని ఓ గ్రామ్ తూ.చ తప్పకుండా పాటిస్తోంది.అంతేకాదు ఆ ఆచారమే ఆ గ్రామానికి గుర్తింపును కూడా తీసుకొచ్చింది.

అసలు వారి ఆచార వ్యవహారాలు ఏంటి…? దానివల్ల వారికేం మేలు జరుగుతుంది.? ఇంతకు వింతైన ఆచారం పాటించే ఆ గ్రామం ఎక్కడ ఉంది.? ఆ ఆచారాన్ని వాళ్లు ఏ విధంగా పాటిస్తున్నారు.? అనేది తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న వారి ఆచారం గురించి తెలుసుకోవాల్సిందే.

ఎవరైనా దేవుల్లను పూజిస్తారు.చిత్ర పటాలను, రాయిలో దేవున్ని చూసుకొని లేదా ఆవుల్లో అయినా దేవుల్లను చూసుకొని వారికి పూజలు చేస్తుంటారు.కానీ అక్కడ మాత్రం గబ్బిలాలకు పూజలు చేస్తారు ఆ గ్రామం వారు.త చిత్తూరు జిల్లా, రామచంద్రపురం మండలంలోని నడవలూరు గ్రామంలో వింత ఆచారాన్ని ఇప్పటికీ గ్రామస్తులు ఆచరిస్తున్నారు.

గ్రామంలో గబ్బిలాలను దేవతలుగా కొలుస్తారు.అవే వారిని కష్టాల నుంచి గట్టిక్కిస్తాయని భావిస్తారు.

గ్రామ ముఖద్వారం వద్ద 11 చింత చెట్లు స్వాగతం పలుకుతుంటాయి.వాటికి వందల సంఖ్యలో గబ్బిలాలు వేలాడుతుంటాయి.

కొత్తగా ఎవరు వెళ్లినా ఆ గబ్బిలాలను చూసి భయపడిపోతారు.కానీ అవే వారికి గ్రామదేవతలు.

ఈ గ్రామం వారు గబ్బిలాలను గ్రామదేవతగా కొలిచే సాంప్రదాయం ఈనాటిది కాదు.కొన్ని దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది.గబ్బిలాలను దేవతలుగా కొలవడం వెనుక పెద్దకథే ఉంది.సాధారణంగా పిల్లలు బరువు తక్కువగా, ఇతర ఆరోగ్య సమస్యలతో పుడుతుంటారు.

ఏదో దోషం వల్లే పిల్లలకు అలా అయిందని గ్రామస్థులు భావిస్తారు.దీనినే పెద్దలు పక్షి దోషమని కూడా పిలుస్తారు.

అనారోగ్యాలతో జన్మించిన చిన్నారులను గబ్బిలాల ఆవాసం అయిన చింతచెట్టు వద్ద తీసుకొచ్చి స్నానం చేయిస్తారు.ప్రత్యేక పూజలు చేసి ఇక చెట్టు మొదల్లో ఉన్న తొర్రల నడుమ చిన్నారులను ఉయ్యాల ఊపినట్లు చూపిస్తారు.

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత పసికందులకు చెందిన వస్త్రాన్ని చెట్టుకి కట్టడంతో దోషం తొలగుతుందని గ్రామస్థుల నమ్మకం.గబ్బిలాలు ఉండటం వల్లే తమ గ్రామం చల్లగా ఉందని స్థానికులు భావిస్తారు.

ఇక రాత్రంతా ఆహారం కోసం వేటకు వెళ్లి పగలు చింత చెట్లపై ఊగిసలాడే గబ్బిలాలకు ఎవరైనా కీడు తలపెడితే గ్రామస్తులకు కోపం నషాలానికి అంటుతుంది.అలాంటివారిని చింత చెట్టుకు కట్టేసి బడితెపూజ చేస్తారు.గబ్బిలాల వల్ల కరోనా వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయన్న వార్తలు వచ్చినా గ్రామస్తులు వీటికి ఎలాంటి హాని తలపెట్టలేదు.పైగా వాటిని కంటికిరెప్పలా కాపాడుకున్నారు.ఈ ఆచారాన్ని ఆ ఒక్క గ్రామంలోనే కాకుండా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు పాటిస్తారు.చాలా మంది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు.

అలాగే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పూజలు చేయిస్తారని గ్రామస్తులు చెప్తున్నారు.ఇలా పెద్దలిచ్చినా ఆచారాన్ని నేటికి నమ్ముతూ పాటిస్తున్నారు ఆ స్థానికులు.

గబ్బిలాలను రాత్రి పూట చూస్తే అరిస్టంగా భావించే వారు కూడా ఉన్నారు.అలాంటి వాటిని వారు దేవతలుగా భావించి పూజిస్తారు.

వాటికి హానీ తలపెట్టరు.పెట్టనివ్వరు.

ఎవరైనా హానీ తలపెట్టినా ఊరుకోరు.ఇలాంటి ఆచారాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు.

Unique Tradition in Chittoor Worshipping bats

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube