ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.47
సూర్యాస్తమయం: సాయంత్రం 06.49
రాహుకాలం:మ.3.00 నుండి సా.4.30
అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 రా.11.15 ల12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఒక శుభవార్త వింటారు.స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసేముందు ఆలోచనలు చేయాలి.
వృషభం:

ఈరోజు మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.
మీరు అంటే గిట్టని వారు అనవసరమైన విషయాలలో తలదూర్చుస్తారు.చాలా జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:

ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించడం మంచిది.
కర్కాటకం:

ఈరోజు మీరు మనోధైర్యాన్ని కోల్పోతారు.ఏ పని మొదలు పెట్టినా నిదానంగా పూర్తవుతుంది.మీరు చేసే పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సింహం:

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేస్తారు.సమయానికి డబ్బు చేతికందుతుంది.మీ తోబుట్టువులతో కలసి యాత్రలకు వెళ్తారు.అక్కడ ఎంతో సంతోషంగా గడుపుతారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
కన్య:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుటపడుతుంది.
తులా:

ఈరోజు మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.కొన్ని కోర్టు సమస్యల నుండి బయట పడతారు.స్నేహితుల ద్వారా కొన్ని మంచి పనులు ప్రారంభిస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.మీరు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
మీరు చేసే ఉద్యోగంలో ఒక శుభవార్త వింటారు.ఆ శుభవార్త మిమ్మల్ని ఎంతో సంతోషం పరుస్తుంది.
ధనస్సు:

ఈరోజు మీకు బలహీనత ఎక్కువగా ఉంటుంది.బయట మానసిక ఒత్తిడితో సతమతమవుతారు.స్నేహితుల నుండి కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిగత విషయాలు మీ ఆడ పడుచుల తో పంచుకోండి.ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
మకరం:

ఈరోజు మీరు జీవిత భాగస్వామితో కలిసి చాలా సంతోషం గడుపుతారు.కుల సంబంధిత విభేదాలు వస్తాయి.తల్లి దండ్రులతో వాదనలకు దిగకండి.
ఉత్సాహంతో ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.చాలా సంతోషం ఉంటారు.
కుంభం:

ఈరోజు మీరు ఎప్పటి నుంచో వాయిదా పడ్డ పనులను పూర్తి చేస్తారు.అప్పు తీరుస్తారు.అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు.ఏదో తెలియని ఆందోళన మీ మనసులో ఉండి పోతుంది.చాలా ఒత్తిడిగా ఉంటుంది.
మీనం:

ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు చేసే పనుల్లో జాగ్రత్తలు పాటించాలి.
లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దైవ దృష్టితో ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.