మహేష్ బాబుకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎంతో ఇష్టం.తన తండ్రి సినిమా పరిశ్రమలో ఉన్నా.
సినిమాలు అంటే ఎప్పుడూ సీరియస్ గానే తీసుకునే వాడు ప్రిన్స్.తన తండ్రి పెద్ద హీరో కాబట్టి తను అల్లాటప్పాగా చేసినా నడుస్తుంది అనుకునే మనస్తత్వం కాదు ఆయనది.
మహేష్ బాబు తొలిసారి పోరాటం అనే సినిమాలో నటించాడు.అప్పుడు తన వయసు 8 సంవత్సరాలు.
ఆ సినిమాలో తన నటనకు మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.
తన తండ్రి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన శంఖారావం సినిమా నుంచి యాక్టింగ్ ను సీరియస్ గా తీసుకున్నాడు మహేష్ బాబు.ఓ రోజు యాథావిధిగానే సినిమా షూటింగ్ కు వెళ్లాడు.
అక్కడ తనలాగే డ్రెస్ వేసుకున్న అబ్బాయిని చూశాడు.తను ఎందుకు అలా డ్రెస్ వేసుకున్నాడు? అని అడిగాడు.అంటే నీకు డూప్ గా ఈ అబ్బాయిని పెట్టాం.రిస్కీ షాట్ తను చేస్తాడు అని చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్.ఈ మాత్రం దానికి డూప్ ఎందుకు తానే యాక్ట్ చేస్తానని చెప్పాడు.వెంటనే సై నుంచి కిందికి దూకి చూపించాడు.
తనకు డూప్ అవసరం లేదని నిరూపించాడు.
కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా కొడుకు దిద్దిన కాపురం.ఈ సినిమాలో ఓ బైక్ స్టంట్ ఉంటుంది.అది చాలా రిస్కీ సీన్.
మహేష్ కు డూప్ ను పెట్టారు.అయితే తన తండ్రి ఉంటే ఆ షాట్ చేయనివ్వడని తెలిసి.
తను లంచ్ కు వెళ్లగానే స్టంట్ మాస్టర్ ను ఒప్పించి డూప్ లేకుండానే ఆ స్టంట్ చేశాడు మహేష్.అటు బాల చంద్రుడు సినిమాలు కొండపై నుంచి దూకే సీన్ ఉంటుంది.
డూప్ ఉన్నా వద్దని చెప్పి తను దూకుతాడు.ఆ సమయంలో ఆయనకు గాయాలయ్యాయి.
మెడ దగ్గర దెబ్బలు తగిలాయి.అయినా తను రిస్కీ షాట్లు చేయడం మానలేదు.