మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే దీన్ని అస్సలు తినవద్దు..!

వాము( Ajwain ) వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.చాలా మంది భారతీయులు ఎన్నో రకాల వంటల్లో ఈ వాములను ఉపయోగిస్తూ ఉంటారు.

 Are You Also Suffering From These Problems..? But Don't Eat It At All , Ajwain,-TeluguStop.com

అందుకే ప్రతి ఒక్కరు వంటింట్లో మసాలా దినుసులతో పాటుగా ఈ వాము కూడా తప్పనిసరిగా ఉంటుంది.వాము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా గ్యాస్, అజీర్తి సమస్యలను కూడా నివారిస్తుంది.అలాగే జలుబు, దగ్గు(Cold, cough ) నుండి ఉపశమనం పొందడానికి కూడా ఎక్కువగా వామును ఉపయోగిస్తారు.

ఇక గొంతు సమస్యలు, విష జ్వరాలను కూడా తగ్గించడంలో వాము సహాయపడుతుంది.వాము రుచికరంగా, ఘాటుగా ఉంటుంది.

Telugu Ajwain, Cough, Fungal, Problems, Tips, Mouth Ulcers, Pregnant-Telugu Heal

ముఖ్యంగా దగ్గు, జలుబు, హైబీపీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వామును తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.అలాగే విటమిన్ ఏ, సి, ఈ, కే లతో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్ తదితర పోషకాలు కూడా వాములో ఉంటాయి.కాబట్టి మనకు అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి వాము ఉపశమనాన్ని అందిస్తుంది.ఇక అంతేకాకుండా వాములో ఉండే థైమిన్ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా పనిచేసే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

దీంతో చాలామంది మామూలు, డైరెక్ట్ గా కానీ లేదా ఫుడ్ ద్వారా గాని తీసుకుంటారు.వాటర్ లో కూడా కలుపుకొని తాగుతారు.

Telugu Ajwain, Cough, Fungal, Problems, Tips, Mouth Ulcers, Pregnant-Telugu Heal

వాము ఆరోగ్యానికి చాలా మంచిది.కానీ ఇది మోతాదుకు మించి మాత్రం తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) వస్తాయి.ఇక గర్భిణీలు వామును తీసుకోకపోవడం మంచిది.అలాగే వేడి ఎక్కువగా ఉన్నవారు కూడా వామును అస్సలు తీసుకోకూడదు.మరి ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో అస్సలు తీసుకోకూడదు.అంతేకాకుండా ఎలర్జీ ఉన్నవారు కూడా వామును ఎక్కువగా తీసుకోకూడదు.

దీని వలన వాంతులు, వికారం లాంటి సమస్యలు వస్తాయి.అంతేకాకుండా వామును డైరెక్ట్ గా అతిగా తీసుకోవడం వలన నోట్లో మంట, పుండ్లు( Mouth Ulcers, ) అయ్యే ప్రమాదం కూడా ఉంది.

కాబట్టి వామును అవసరం మేరకే తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube