మృత కణాలను పోగొట్టి ముఖ చర్మాన్ని తెల్లగా మార్చే ఎఫెక్టివ్ రెమెడీ మీకోసం!

కాలుష్యం, ఎండల ప్రభావం వల్ల చర్మంపై మృత కణాలు లేదా డెడ్ స్కిన్ సెల్స్ ఎప్పటికప్పుడు ఏర్ప‌డుతూనే ఉంటాయి.కొందరు వాటిని తరచూ తొలగించుకుని చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.

 An Effective Remedy To Remove Dead Cells And Make The Skin White Is For You Deta-TeluguStop.com

కానీ కొందరు మాత్రం డెడ్ స్కిన్ సెల్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు.ఫలితంగా చర్మం యొక్క నిగారింపు తగ్గిపోతుంది.

స్కిన్ టోన్ సైతం దెబ్బతింటుంది.దీంతో ముఖ చర్మం డల్ గా కనిపిస్తూ ఉంటుంది.

అయితే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్‌ రెమెడీని వారంలో కేవలం రెండు సార్లు కనుక పాటిస్తే మృత కణాలు తొలగిపోవడమే కాదు ముఖ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా సైతం మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎఫెక్టివ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Honey, Latest, Skin Care, Skin Care Tips, Sugar-Telug

అలాగే వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకోవాలి.చివ‌రిగా రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్ మరియు మూడు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు చర్మాన్ని స్క్రబ్ చేసుకుని ఆపై పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Honey, Latest, Skin Care, Skin Care Tips, Sugar-Telug

అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని.ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ ఎఫెక్టివ్ రెమెడీ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

అదే సమయంలో చర్మాన్ని తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.కాబట్టి ఇకపై డెడ్ స్కిన్ సెల్స్‌ విషయంలో నిర్లక్ష్యం వదిలిపెట్టి పైన చెప్పిన రెమెడీని పాటించండి.

తెల్లగా మరియు కాంతివంతంగా మెరిసిపోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube