రాజబాబు హీరోగా ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా ?

పుట్టిన రోజు, వర్ధంతి కి మాత్రమే జనాలు తమ అభిమాన నటులను గుర్తు చేసుకుంటున్న రోజులు ఇవి.సోషల్ మీడియా ఇంత వ్యాప్తి చెందిన, అలనాటి నటులకు మాత్రం పెద్దగా ఈ కాలంలో గుర్తింపు దక్కడం లేదు.

 Raja Babu Movies As Hero ,raja Babu,actor Rajababu,appalaraju,madras,rajahmundry-TeluguStop.com

ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నటుడు రాజబాబు.అసలు పేరు అప్పలరాజు.1937 అక్టోబర్ 20 తారీఖున పుట్టిన రాజా బాబు సినిమా అవకాశాల కోసం చాల మంది నటుల లాగానే మద్రాసు రైలెక్కారు.తొలుత రాజమండ్రి లో చదువు పూర్తి చేసి స్కూల్ టీచర్ గా పని చేసిన రాజా బాబుకి సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉండేది.

ఆలా తొలిసారి 1960 వ సంవత్సరం లో సమాజం అనే సినిమాతో వెండితెర ప్రవేశం చేసాడు.

Telugu Rajababu, Appalaraju, Madras, Raja Babu, Rajahmundry, Ramaprabha, Samaaja

దాదాపు రెండు దశాబ్దాలు ఏకధాటిన నటించిన రాజబాబు ఎక్కువగా రమాప్రభ తో కంబినేషన్ సినిమాల్లో నటించారు.వీరి జోడికి తెలుగు, తమిళ సినిమాల్ మంచి డిమాండ్ ఉండేది.తనదైన నటనతో, మానేరిజమ్స్ తో కామెడి ని పండించడం లో రాజబాబు దిట్ట అనే చెప్పాలి.

ఇక సినిమాల్లో పాటలు ఉంటాయి కానీ రాజబాబు రమాప్రభ పై రొమాన్స్ తో కూడా హాస్య భరిత పాటలు పెట్టడం వీరితోనే ప్రారంభం అయ్యి వీరితోనే ముగిసిపోయింది.అయితే కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా నటించిన ఘనత రాజబాబు కి చెల్లింది.

తాత మనవడు సినిమాలో మొదటి సారిగా హీరోగా నటించాడు రాజబాబు.ఈ సినిమాలో హీరోయిన్ గా సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల నటించింది.

Telugu Rajababu, Appalaraju, Madras, Raja Babu, Rajahmundry, Ramaprabha, Samaaja

ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే, తిరుపతి, పిచ్చోడి పెళ్లి, మనిషి రోడ్డున పడ్డాడు అనే సినిమాల్లో హీరోగా నటించాడు.అయితే మనిషి రోడ్డున పడ్డాడు అనే సినిమాకు రాజబాబు నిర్మాతగా వ్యవహరించి ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు.చివరికి నిజంగానే ఈ సినిమా వల్ల అయన అప్పట్లో రోడ్డున పడ్డాడు అంటూ అందరు మాట్లాడుకునే వారు.1981 లో గడసరి అత్త సొగసరి కోడలు అనే సినిమాలో రాజబాబు చివరగా నటించాడు.అప్పటికే ఆయనకు గొంతు కాన్సర్ సోకి మాట పూర్తిగా పోయింది.ఇక 1983 లో అయన తుది శ్వాస విడిచారు.రాజబాబు కి భార్య లక్ష్మి అమ్ములు, కుమారులు నాగేంద్ర మరియు మహేష్ లు ఉన్నారు.ప్రస్తుతం వీరు అమెరికాలో జీవిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube