న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఆదిలాబాద్ లో మత్తు ఇంజక్షన్ కలకలం

ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో మత్తు ఇంజక్షన్ కలకలం రేపింది.హరినాయక్ తాండ గ్రామంలో బస్టాండ్ లో నిలుచున్న శ్రీకాంత్ అనే యువకుడికి ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని ఇంజక్షన్ పొడిచే పరారయ్యారు. 

2.రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.అయితే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు.దీంతో ప్రభుత్వం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

3.దూరవిద్య కోర్సుల అడ్మిషన్ గడువు పొడిగింపు

  విద్య డిగ్రీ కోర్సుల అడ్మిషన్ గడువు పొడిగిస్తున్నట్లు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రకటించింది. 

4.దీపావళికి ప్రత్యేక రైళ్లు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

దీపావళి పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి పది ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

5.ఇన్ సర్వీస్ కోట అభ్యర్థులకు న్యాయం చేయండి

 తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులకు పీజీ ఇన్ సర్వీస్ కోటలో జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ మెడికల్  జేఏసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళింది. 

6.జేఈల సర్వీసును రెగ్యులరైజ్ చేయండి : హైకోర్టు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్ల సర్వీస్ ను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది. 

7.నిమ్స్ లో కీమోథెరపీ డే కేర్ సేవలు ప్రారంభం

  నిజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఆంకాలజీ విభాగంలో డేకేర్ కీమోథెరపీ సేవలను బుధవారం నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ప్రారంభించారు. 

8.24 గంటల్లో అల్పపీడనం నేడు రేపు వర్షాలు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఈ ప్రభావంతో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

9.యాజమాన్య కోట ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

  తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తులు నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

10.విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

పోలీసుల సంస్మరణ దినోత్సవంను పరిష్కరించుకుని రేపు విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

11.కల్వకుర్తిని పరిశీలించిన కృష్ణ బోర్డు చైర్మన్

  హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ఆరు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించిన నేపథ్యంలో వాటి పురోగతిపై కృష్ణ నది యాజమాన్య బోర్డు దృష్టి సారించింది.ఈ మేరకు కృష్ణ బోర్డ్ చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ అధికారులు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. 

12.డిపిఆర్ లకు క్లియరెన్స్ ఇవ్వండి

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

గోదావరి నదిపై నిర్మిస్తున్న చనక కోరాటా బ్యారేజ్ , చౌటుప్పల్ హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకాలకు చెందిన డీపీ ఆర్ లకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 

13.రాహుల్ యాత్ర కు భారీ ఏర్పాట్లు

  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు పార్టీ నాయకత్వం సంగారెడ్డి జిల్లాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

14.జగన్ పై చంద్రబాబు కామెంట్స్

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

ప్రజా సమస్యలపై ఈగో వద్దు జగన్ రెడ్డీ.ఇష్యూను సాల్వ్ చేయండి అంటూ నర్సీపట్నంలో విద్యార్థుల పోరాటంపై టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్ చేశారు. 

15.ఏపీలో దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి

  ఏపీలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. 

16.టిడిపి జనసేనతో కలిసి పని చేస్తాం

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

టిడిపి , జనసేనతో కలిసి పని చేసేందుకు సిపిఐ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. 

17.ఎంపీ భరత్ పై జగన్ చర్యలు తీసుకోవాలి

  అమరావతి రైతుల పాదయాత్ర పై దాడి చేయడం దుర్మార్గమని వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ పై చర్యలు తీసుకోవాలని సిపిఐ నేత ముప్పాళ్ళ నాగేశ్వరావు జగన్ ను డిమాండ్ చేశారు. 

18.పవన్ వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అందరికీ మంచి జరగాలనే మూడు రాజధాని అంటున్నానని జగన్ తెలిపారు. 

19.రైతుల పాదయాత్రను అడ్డుకోవడం పై హైకోర్టులో పిటిషన్

  న్యాయస్థానం అనుమతి ఇచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. 

20.బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో లోకేష్ సమావేశం

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Godavari River, Janas

టిడిపి కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అయ్యారు.   

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube