యవ్వనాన్ని రెట్టింపు చేసే పెరుగు.. వారంలో రెండు సార్లు ఇలా వాడిన చాలు!

పెరుగు.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యం తయారయ్యే ఆహారాల్లో ఒకటి.పెరుగు లేనిదే భోజనం అసంపూర్ణం.ఎన్ని రకాల వంటలు ఉన్నా కూడా భోజనం చివర్లో పెరుగు తినకపోతే అసంతృప్తిగానే ఉంటుంది.అంతలా పెరుగుకు అలవాటు పడ్డారు.పెరుగు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను కూడా కలిగి ఉంటుంది.

 Try This Curd Massage Cream For Youthful Skin! Curd Massage Cream, Youthful Skin-TeluguStop.com

అందువల్ల ఆరోగ్యానికి పెరుగు అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది.అయితే అందానికి మెరుగులు దిద్ద‌డానికి కూడా పెరుగు ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Tips, Curd, Curd Benefits, Latest, Massage Cream, Skin Care, Skin Care Ti

ముఖ్యంగా చ‌ర్మ‌ యవ్వనాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం పెరుగుకు ఉంది.పెరుగుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా మసాజ్ క్రీమ్ ను తయారు చేసుకుని వారంలో రెండు సార్లు వాడిన చాలు మీ స్కిన్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.పెరుగుతో మసాజ్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును వేసుకోవాలి.

Telugu Tips, Curd, Curd Benefits, Latest, Massage Cream, Skin Care, Skin Care Ti

అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ) వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన మసాజ్ క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై తడి క్లాత్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఇలా చేసిన చాలు బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి.ముఖ్యంగా పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తాయి.అలాగే అలోవెరా జెల్, తేనె, రోజ్ వాటర్ కూడా యవ్వనాన్ని రెట్టింపు చేయడానికి సహాయపడతాయి.

చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచుతాయి.మరియు మృదువుగా మెరిపిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube