లైంగిక దాడి కేసు.. బాధితురాలి పేరు చెప్పడంతో మళ్లీ విజయ్ బాబు అరెస్ట్?

మలయాళ నటుడు నిర్మాత విజయ్ బాబు లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది.

 Malayalam Actor Vijay Babu Held Kerala Police After Victim Name Revealed Social-TeluguStop.com

ఇదే విషయం పై విజయ్ బాబు పై కేరళ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.సదరు మహిళ విజయ్​ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా పోలీసులు విజయ్ బాబు ని అరెస్ట్‌ చేశారు.

లైంగిక ఆరోపణల కేసులో కొన్ని నెలల క్రితం విజయ్‌ బాబుపై కేసు నమోదు కాగా కేరళ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పొందాడు.

కానీ అతను నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల సోషల్‌ మీడియాలో తనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఆ నటి పేరును వెల్లడించాడు.దీంతో తాజాగా పోలీసులు అతడిని అరెస్టు చేయగా ఆ వెంటనే బెయిల్‌ పై విడుదల అయి బయటకు వచ్చాడు.

అయితే జూలై 3వ తేదీ వరకు విజయ్‌ బాబను ప్రశ్నించడానికి హైకోర్టు పోలీసులు అనుమతి ఇచ్చింది.

Telugu Malayalam, Mollywood, Vijay Babu-Movie

అయితే మొదట ఈ లైంగిక ఆరోపణలను నటుడు విజయ్ ఖండిస్తు తాను ఎలాంటి తప్పు చేయలేదని,నేను ఎటువంటి తప్పు చేయనప్పుడు భయపడను.ఇక్కడ నేను బాధితుడిని నాపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళ 2018 నుంచి నాకు తెలుసు అని విజయ్​ బాబు తెలిపిన విషయం తెలిసిందే.అయితే ఇప్పట్లో ఈ కేసు సద్దుమణిగేలా కనిపించడం లేదు.

మరి ఈ కేసులో సదరు మహిళ చెప్పిన విధంగా విజయ్ బాబు ఆ మహిళలు లైంగిక వేధింపులకు గురి చేశాడా, ఆ మహిళ చెప్పింది నిజమేనా అన్నది తెలియాలి అంటే ఈ కేసు పూర్తయ్యే వరకు ఎదురు చూడాలి మరి.ఏది ఏమైనప్పటికీ విజయ్ బాబు మాత్రం దానికి ఏ తప్పు చేయలేదని ఫుల్ కాంన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube