ఈ ఆహార పదార్థాలను కలిపి తింటే చెడు కొలెస్ట్రాల్ పరార్..!

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం గుండె సంబంధిత వ్యాధుల్లో మూడో భాగం అధిక కొలెస్ట్రాల్( Cholesterol ) వల్లే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

 If You Eat These Food Items Together, Bad Cholesterol Will Be Avoided , Bad Chol-TeluguStop.com

కొద్ది శాతం కొలెస్ట్రాల్ శరీర కణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది.కానీ అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోతుంది.

కానీ సరైన ఆహారం తినడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Telugu Bad Cholesterol, Tips, Probiotics-Telugu Health Tips

కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే పప్పులో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.బ్రౌన్ రైస్ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతుంది.

ఇంకా చెప్పాలంటే ప్రతి భారతీయ వంటకం లో పసుపును సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు.దీనీకుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం( General of Nutrition and Metabolism ) చేసిన పరిశోధనలో పసుపు మిరియాల సప్లిమెంట్లు 12 వారాలపాటు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి త్వరగా తగ్గుతుంది.

Telugu Bad Cholesterol, Tips, Probiotics-Telugu Health Tips

బ్రిటిష్ జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదిక ప్రకారం పెరుగు తినడం వల్ల నాలుగు శాతం దాకా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.ఈ పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి.ఇవి జీర్ణ క్రియను పెంచి వాపు సమస్యలను దూరం చేస్తాయి.

బాదం, పెరుగు కలిపి తింటే రుచికరమైన స్నాక్స్ తో పాటు ఆరోగ్యం కూడా ఎంతో బాగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.నిమ్మరసంలో ఫ్లవనాయిడ్లు ఉంటాయి.

వీటికి కూడా చెడు కొవ్వు ను తగ్గించే గుణం ఉంది.ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube