ప్రస్తుతం భారతదేశంలో డయాబెటిస్( Diabetes ) లేని కుటుంబం ఉంది అంటే ఆశ్చర్య పోవాల్సిందే.మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలతో పాటు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలు( Healthy Food ) ఉండేటట్లు చూసుకోవాలి.వీరు తీసుకునే రోజువారి ఆహారాలలో బీరకాయతో( Ridge Gourd ) తయారు చేసిన ఆహర పదార్థాలు తీసుకుంటే రక్తంలోని చక్కర పరిమాణాలను సులభంగా నియంత్రించుకోవచ్చు.
బీరకాయతో చేసిన ఈ క్రింది అద్భుతమైన రెసిపీనీ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.అయితే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.బీరకాయ పల్లి కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు.మొదటిగా 500 గ్రాముల బీరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టీ స్పూన్ల యాలకుల పొడి, ఒక టీ స్పూన్ మిరపపొడి, రెండు రెమ్మల కరివేపాకు, ఫ్రైకి సరిపడా ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఇంగువ, పోపు దినుసులు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక కప్పు పల్లీల పొడి, ఒక కట్ట కొత్తిమీర ఉంటే సరిపోతుంది.
ముందుగా మిక్సీ జార్ లో వేయించిన వేరుశనగపొడిని వేసుకోవాలి.అందులోకి కొబ్బరి ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేయాలి.ఇలా గ్రైండ్ చేసిన పొడిని పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ పై ఒక బాణలి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి.
ఇలా వేడెక్కిన తర్వాత పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేగిన తర్వాత ధనియాల పొడి, ఉప్పు, మిరప్పొడి వేసుకొని ఐదు నిమిషాల పాటు మళ్ళీ దోరగా వేయించాలి.
ఆ తర్వాత బీరకాయ ముక్కలను వేసి ఐదు నిమిషముల పాటు బాగా వేయించాలి.ఇలా వేయించుకునే క్రమంలో బీరకాయలు మగ్గుతాయి.ఇలా ముక్కలు బాగా మగ్గిన తర్వాత వేరుశనగలతో తయారు చేసిన పొడిని ఇందులో వేసి బాగా కలిపిన తర్వాత ఐదు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.కూర పైన కొత్తిమీరతో గర్నిష్ చేసి తినవచ్చు.
ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు రోటీలతో పాటు ఈ కర్రీని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడం ఖాయం.