రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.( Game Changer ) ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) నిర్మించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.దీంతో నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమాతో భారీగానే నష్టాలు మిగిలాయి.
ఆ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో రెండుసార్లు ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే.సరిగ్గా 11 ఏళ్ళ క్రితం అనగా 2014లో వీరిద్దరి కాంబినేషన్లో ఎవడు సినిమా( Yevadu Movie ) వచ్చింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు.చాలా రకాల అడ్డంకులు ఏర్పడ్డాయి.
నిర్మాతగా మంచి పీక్స్ లో ఉన్న సమయంలో దిల్ రాజుకు చాలా సమస్యలు కూడా వచ్చాయి.
ఎట్టకేలకు రిలీజ్ చేసి కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకున్నారు కానీ ఫ్యాన్స్ ఆశించినట్టు రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ పడలేదు.కట్ చేస్తే ఇప్పుడు గేమ్ ఛేంజర్ వంతు.దర్శకుడు, టీమ్ తో పాటు ఈసారి ఫలితం కూడా మారింది.
మూడేళ్ళ నిర్మాణం, చరణ్ విలువైన సమయం, 50వ సినిమాగా ఎస్విసి సంస్థ మైలురాయి ఆశలన్నీ ఆవిరయ్యాయి.ఎవడు చెప్పుకోవడానికి విజయం సాధించింది కానీ గేమ్ ఛేంజర్ దానికి నోచుకోలేదు.
దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది.సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) విజయాన్ని ఆస్వాదిస్తున్నారు కనక అదయ్యాక గేమ్ ఛేంజర్ లెక్కల మీద దృష్టి పెట్టొచ్చు.
షాక్ ఇచ్చే నెంబరే నష్టంగా మిగలనుంది.దీన్ని రికవర్ చేయాలనే ఉద్దేశం మూడో సినిమా రాజు గారి బ్యానర్ లోనే చేసేందుకు రామ్ చరణ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ప్రకటన రాలేదు కానీ, ఈ సినిమా ద్వారా అంతో ఇంతో నష్టాలను పూడ్చే పనిలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది.ఒకవేళ ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చినా కూడా బాగానే టైం పడుతుందని తెలుస్తోంది.ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్షన్లో నిర్మాణంలో ఉన్న ఆర్సి 16 అయ్యాక సుకుమార్ తో ఆర్సి 17 మొదలవుతుంది.ఇవి రెండు అయ్యేలోపు ఏదైనా కథ, దర్శకుడు కుదిరితే రామ్ చరణ్ దిల్ రాజుకో సినిమా చేసే ఛాన్స్ ఉంది.
కానీ ప్రస్తుతానికి ఇవన్నీ ఫిలిం నగర్ లో జరుగుతున్న చర్చలే.ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.మరి దిల్ రాజు రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న తదుపరి సినిమా అయినా ఆ నష్టాలను కొంతమేరకు అయిన పూడుస్తున్నమో చూడాలి మరి.