జెంటిల్ మ్యాన్.1993లో తెరకెక్కిన ఈ సినిమా శంకర్ దర్శకత్వం వహించిన తొలి మూవీ.అర్జున్ హీరోగా, చరణ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా తమిళ, తెలుగు సినిమా పరిశ్రమల్లో సంచలన విజయాన్ని అందుకుంది.తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.
కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా హిట్ అయ్యింది.తెలుగునాట జనాలు థియేటర్లకు ఈ సినిమాను చూసేందుకు క్యూ కట్టారు.
తెలివిగా దొంగతనాలు చేసే అర్జున్ ను పట్టుకునేందుకు పోలీస్ అధికారికిగా చరణ రాజ్ ఎన్నో ఎత్తులు వేస్తాడు.ఆ ఎత్తులను చిత్తు చేస్తూ వరుస దొంగతనాలు చేస్తాడు అర్జున్.
అటు మధుబాల, అర్జున్ మధ్యన రొమాంటిక్ సీన్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమాలో హీరోగా తొలుత అర్జున్ ను అనుకోలేదట.
ఇంతకీ ఈ సినిమా తొలి అవకాశం ఎవరికి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కెరీర్ లో తొలి సినిమాను రాజశేఖర్ తో తెరకెక్కించాలి అనుకున్నాడట శంకర్.
అప్పటికే ఆహుతి, అంకుశం లాంటి సినిమాలు చేసి మంచి స్వింగ్ లో ఉన్నాడు రాజశేఖర్.ఈ సినిమాకు తను అయితే బాగుంటుంది అనుకున్నాడట.
సుమారు 10 లక్షల రూపాయలు చేతులో పట్టుకుని మరీ రాజశేఖర్ కు కథ చెప్పేందుకు వచ్చాడు శంకర్.ఇందులో హీరో పాత్రకు మీరు అయితేనే బాగుటుంది అని చెప్పాడట.
కానీ కొన్ని కారణలతో తను ఈ సినిమాను వదులుకున్నాడట.
నిజానికి శంకర్.రాజశేఖర్ ను కలిసే సమయానికి తను రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి ప్రియుడు సినిమా చేసేందుకే ఓకే చెప్పాడట.డేట్స్ కూడా ఇచ్చాడట.
ఈ సినిమా కథ శంకర్ చెప్తుంటే తనకూ చాలా బాగా నచ్చిందట.అయితే అప్పటికప్పుడు డేట్స్ ఇచ్చేందుకు కుదరలేదట.
అప్పట్లో చాలా మంది హీరోలు ఎన్ని సినిమాలకైనా డేట్స్ ఇచ్చే వారిని రాజశేఖర్ చెప్పాడు.కానీ తనకు అలా ఇవ్వడం చేతకాకపోయిందని చెప్పాడు.
అందుకే ఈ సినిమాలో చేయలేకపోయినట్లు వెల్లడించాడు.ఈ సినిమా చేసి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని చెప్పాడు.
అటు ఈ సినిమాను చిరంజీవి హిందీలో అదే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.