పూజా హెగ్డే( Pooja Hegde ) ఒకానొక సమయంలో సౌత్ సినీ ఇండస్ట్రీలోనూ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోను ఓ వెలుగు వెలిగారు.ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మను వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడాయి.
ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో అవకాశాలు లేక పూజా హెగ్డే పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలతో పాటు బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటూ తిరిగి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో పూజా హెగ్డే బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరియర్ గురించి, కెరియర్ పరంగా తనకు ఎదురైన అనుభవాలు గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇటీవల తాను ఒక తమిళ సినిమా ఆడిషన్స్( Tamil Movie Auditions ) కోసం వెళ్లగా తనని ఆ సినిమాలో రిజెక్ట్ చేశారని తెలిపారు .అయితే రిజెక్ట్ చేయడానికి కారణం ఆ పాత్రకు నా వయస్సు సరిపోదని నాకంటే పెద్ద వయసు ఉన్న వారిని తీసుకోవాలని నన్ను రిజెక్ట్ చేశారు.

ఇలా తాను ఆడిషన్స్ కి వెళ్లడం వల్ల నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని తెలిపారు.నేను ఆడిషన్స్( Audition ) కి వెళ్ళటం వల్ల ఎలాంటి పాత్రలనైనా చేయగలను అనే నమ్మకాన్ని మేకర్స్ కి కల్పించినట్టు అవుతుందని తెలిపారు.ఆడిషన్స్‌కు వెళ్లేందుకు అహంకారం ప్రదర్శించనని… కష్టపడి పని చేయటానికి ఏమాత్రం వెనకాడనని తెలిపింది.ఏదేమైనా ఒక నటిగా ఆడిషన్స్‌కు వెళ్లడానికి తాను ఎప్పుడు సిగ్గుపడను అంటూ పూజ హెగ్డే చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న రెట్రో( Retro ) సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.