నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు.పలువురు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ ( Mad Square ) సినిమా ఇటీవల మార్చ్ 28న రిలీజయి పెద్ద హిట్ అయింది.
ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో నిర్మాతలు సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హీరో నార్నె నితిన్( Narne Nithin ) బావ, నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.

ఇకపోతే ఎన్టీఆర్ నటించిన అదుర్స్( Adhurs ) సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో మనకు తెలిసిందే.ఇప్పటికి కూడా ఈ సినిమాని ప్రేక్షకుల కన్నార్పకుండా చూస్తారు.అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి తాజాగా నటుడు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.వివి వినాయక్ ( V.V.Vinayak ) దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో వచ్చిన అదుర్స్ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కామెడీ కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.అయితే సీక్వెల్ సినిమా చేయాలి అంటే ఒక యాక్టర్ కు కామెడీ పండించడం చాలా కష్టం.అందుకే నేను అదుర్స్ 2( Adhurs 2 ) చెయ్యట్లేదు.భయపడుతున్నాను.అంత కామెడీ వస్తుందో లేదో తెలీదు అందుకే నేను ఈ సినిమాకు దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయనీ చెప్పాలి.
ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు ఇలాంటి తరుణంలోనే కామెడీ సినిమా చేయడం అంటే కష్టతరమైన పని అని చెప్పాలి.