సాధారణంగా ఆరోగ్యం అంటే శరీరాన్ని బాగా చూసుకోవడం.అయితే మానసిక స్థితి కూడా బాగా ఉండేట్టుగా చూసుకోవాలి.
శారీరకంగా వీక్ గా ఉన్నా సరే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే ఎలాంటి ఇబ్బంది నైనా ఎదుర్కోవచ్చు.కానీ మానసికంగా వీక్ అయితే మాత్రం శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేక పోతారు.
కాబట్టి మానసిక స్థితి గురించి ఇప్పటి నుంచైనా కేర్ తీసుకోవడం ప్రారంభించాలి.కొన్ని శారీరక మార్పులు మానసిక ఒత్తిడి ( Mental stress )వల్ల కలుగుతాయి.
ఒకవేళ మీలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయంటే వెంటనే మీ ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.జీవితంలో పలు కారణాల వలన మానసిక స్థితి దెబ్బతింటు ఉంటుంది.
అయితే వయసుతో సంబంధం లేకుండా ఈ ఇబ్బందిని చాలామంది ఎదుర్కొంటున్నారు.

అయితే తీవ్రమైన ఒత్తిడి( Stress ) శరీరంపై కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది.దీని వలన మెంటల్ గా, ఫిజికల్ గా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.మానసిక ఒత్తిడి వలన కలిగే లక్షణాలు ఏంటో వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక ఒత్తిడిని వివిధ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.అయితే మానసిక, శారీరక లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ ఎక్కువగా భావోద్వేగాలకు గురవుతారు.
ఎప్పుడు ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది.భయము లేదా ఏదో జరిగిపోతుందనే అభద్రత ఎక్కువగా ఉంటుంది.
ఇక ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ ఉంటారు.మానసిక కల్లోలం, కోపం చూపించలేకపోవడం.
మానసిక ఒత్తిడిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిప్రెషన్.

డిప్రెషన్ లో ఉండేవారు విచారంతో ఉంటారు.సంతోషించాల్సిన వాటిపై ఎలాంటి ఆసక్తి కనపడదు.ఎప్పుడో ఏదో కోల్పోయామనే భావన కనిపిస్తుంది.
రోజువారి బాధ్యతలు నిర్వహించడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది.ఏకాగ్రత ఉండదు.
ఏ పని పైన కూడా దృష్టి పెట్టలేక పోతారు.మతిమరుపు ఉంటుంది.
నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి.ఇక శారీరక లక్షణాలు అంటే.
తరచూ తలనొప్పి, ముఖ్యంగా మైగ్రేన్( Migraine pain ) ఉంటుంది.ఇక కండరాల్లో ఒత్తిడి, నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి.
స్ట్రెస్ వలన శరీరంలో నొప్పులు ఎక్కువగా పెరిగిపోతాయి.కాబట్టి ఈ లక్షణాలను వెంటనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.







