ప్రస్తుతం సినిమా రంగాన్ని యానిమేషన్స్ ఎంతో డామినేట్ చేస్తున్నాయి.చాలా వరకు గ్రాఫిక్స్ తో సినిమాలు నిండిపోతున్నాయి.అయితే 30 ఏండ్ల క్రితమే టెక్నాలజీ అంతగా అందుబాటులోకి రాని రోజుల్లోనే వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు ముత్తు రామన్.1989లో రాజా చిన్నరోజా అనే సినిమాను తెరకెక్కించాడు.హీరోగా రజనీకాంత్, హీరోయిన్ గా గౌతమి నటించారు.అందులో లైవ్ క్యారెక్టర్స్ తో కార్టూన్ క్యారెక్టర్స్ కనిపించేలా చేశాడు.అప్పటి వరకు సినిమా పరిశ్రమలో ఈ అద్భుతాన్ని ఎవరూ చేయలేదు.ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది.
ఇందులో హీరో, హీరోయిన్లు కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ తో ఓ పాటకు డ్యాన్స్ చేస్తాయి.ఈ సీన్లను అప్పట్లో ఎలా రూపొందించారో అర్థంకాక జనాలు అబ్బురపడ్డారు.
ముఖ్యంగా చిన్నపిల్లలను ఎంటర్ టైన్ చేయడం కోసం ముత్తు రామన్ ఈ ప్రయోగం చేశాడు.రాజా చిన్న రోజా సినిమా తీసేందుకు రెడీ అవుతున్న సందర్భంలో దర్శకుడితో నిర్మాత శరవణ న్ ఓ మాట చెప్పాడట.
పిల్లలను ఎక్కువగా అలరించే కార్టూన్ బొమ్మల మాదిరిగా హీరో, హీరోయిన్ తో డ్యాన్స్ చేయిస్తే బాగుంటుంది అని చెప్పాడట.అందులో భాగంగానే ముంబైలో కార్టూన్ క్యారెక్టర్లను తయారు చేసే రామ్మోహన్ సహకారంతో ఈ కార్టూన్ బొమ్మలను తయారు చేశారట.
తమిళ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ చంద్రబోస్.కొరియోగ్రాఫర్ పులియార్ సరోజతో కలిసి ఈ పాట కోపం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
పక్షులు, కుందేళ్లు, ఏనుగులు, పలు జంతువులు, పక్షుల మిళితంగా ఈ పాటను తెరకెక్కించారు.ఈ పాట కోసం ఎంతో సమయం వెచ్చించారు కూడా.

రజనీకాంత్, గౌతమి సహా చిన్నారులతో ఈ పాటను తీస్తున్నప్పుడు ఎప్పుడు కార్టూన్ బొమ్మలు వస్తాయో చెప్పి అప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో వివరించేవారు.అంటే బొమ్మలను ఊహించుకుని యార్టర్లు రియాక్షన్ ఇచ్చేవారు.ఈప్రయోగం హీరో, హీరోయిన్లతో పాటు మిగతా నటులకూ చాలా ఇంట్రెస్ట్ కలిగించింది.

ఈ పాట చిత్రీకరించడానికి వారం రోజుల సమయం పట్టింది.మొత్తంగా ఈ పాట కోసం మూడు నెలలు టైం తీసుకున్నారు.జనాలను అమితంగా ఆకట్టుకుంది ఈ పాట.ఈ పాటను చూసేందుకే జనాలు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చేవారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.