ఖాళీ కడుపుతో జీడిపప్పు తిన‌కూడ‌దు..ఎందుకో తెలుసా?

జీడిప‌ప్పు.ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 What Happens When You Eat Cashew Nuts At Empty Stomach! Cashew Nuts, Eat Cashew-TeluguStop.com

స్వీట్స్‌లో, హాట్స్‌లో విరి విరిగా ఉప‌యోగించే జీడిప‌ప్పు ధ‌ర ఒక్క‌టే ఎక్కువ కాదు.వాటిల్లో ఉండే పోష‌కాలు ఎక్కువే.

కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు జీడి ప‌ప్పులో నిండి ఉంటాయి.అందు వ‌ల్ల‌నే ఆరోగ్య ప‌రంగానూ, సౌంద‌ర్య ప‌రంగానూ జీడి ప‌ప్పు అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ ఖాళీ క‌డుపుతో జీడి ప‌ప్పును తిన‌కూడ‌దని అంటున్నారు నిపుణులు.అస‌లు ఎందుకు జీడిప‌ప్పు ఖాళీ క‌డుపుతో తిన‌కూడ‌దు.? తింటే ఏం అవుతుంది.? వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.జీడిప‌ప్పులో ఫైబ‌ర్ కంటెంట్ కాస్త ఎక్కువ‌గా ఉంటుంది.అందువ‌ల్ల ఖాళీ క‌డుపుతో జీడి ప‌ప్పును తీసుకుంటే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది.

అలాగే ఖాళీ క‌డుపుతో జీడి ప‌ప్పు తింటే. అందులోని సోడియం కంటెంట్ ఒక్కోసారి ర‌క్త పోటు స్థాయిల‌ను అమాంతం పెంచేస్తుంది.అందులోనూ అధిక ర‌క్త పోటు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు ఖాళీ క‌డుపుతో జీడి ప‌ప్పును తింటే రిస్క్ మ‌రింత పెరుగుతుంది.అందువ‌ల్ల ఖాళీ కడుపుతో జీడి ప‌ప్పును పొర‌పాటున కూడా తీసుకోకండి.

ఇక కిడ్నీ సంబంధిత‌ వ్యాధుల‌తో ఇబ్బందిప‌డుతున్న వారు ఖాళీ క‌డుపుతోనే కాదు ఎప్పుడూ కూడా జీడి ప‌ప్పును తీసుకోరాదు.ఎందుకంటే, జీడి ప‌ప్పులో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది.

ఇది కిడ్నీ వ్యాధుల‌ను మ‌రింత తీవ్ర త‌రం చేసేస్తుంది.అందువ‌ల్ల‌నే కిడ్నీ వ్యాధులు ఉన్న వారు జీడి ప‌ప్పుకు దూరంగా ఉండాలి.

Dont Eat Cashews with Empty Stomach Telugu health Videos

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube