ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారు పించన్ తీసుకుంటూ కాళు మీద కాలు వేసుకుని హాయిగా జీవించాలని భావిస్తారు.ప్రభుత్వ ఉద్యోగంను ఇంత మంది కావాలని కోరుకుంటున్నారు అంటే ప్రధాన కారణం ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు, రిటైర్మెంట్ తర్వాత కూడా జీతం వస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నారు.ఎప్పుడెప్పుడు రిటైర్ అవుతామా, ఇంట్లో కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకుందామా అంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తు ఉంటారు.
రిటైర్మెంట్కు దగ్గర పడ్డ వారు వారి పనులు కూడా సరిగా చేయకుండా టైం పాస్ చేస్తూ ఉంటారు.కాని రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో ఒక పని చేయాలనే తాపత్రయంతో ప్రజలకు తనకు తోచిన సేవ చేస్తున్నారు 82 ఏళ్ల కెప్టెన్ మోడెకుట్రి నారాయణ మూర్తి.
ఆర్మీలో జాబ్ చేసిన నారాయణ మూర్తి గారు ఎన్నో యుద్దాల్లో పాల్గొన్నారు.వీరోచిత పోరాటంతో సైన్యంలో కీలక పాత్ర పోషించారు.కెప్టెన్‌గా రిటైర్ అయిన ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడలేదు.ఎన్నో రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూనే ఉన్నారు.
ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత పలు రంగాల్లో తన సేవలను అందించారు.ఇప్పుడు వయసు మీద పడింది.82 ఏళ్ల వయసులో కష్టమైన పనులను చేయలేక పోతున్నారు.దాంతో రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ పని పెట్టుకున్నారు.
వచ్చి పోయే వారిని రోడ్డు దాటించడం, పిల్లలను, వృద్దులను రోడ్డు దాటడంలో సాయం చేయడం చేస్తూ ఉంటారు.
బెంగళూరు రోడ్లపై నారాయణ మూర్తి గారు కనిపించి అందరికి ఆదర్శంగా నిలుస్తారు.ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అయినా ఎప్పుడు ఒకసారి సెలవు పెడతారేమో కాని నారాయణ మూర్తి గారు మాత్రం ఎప్పుడు డ్యూటీకి వస్తూనే ఉంటారని, బెంగళూరు ట్రాఫిక్ విభాగం అధికారులు అంటూ ఉంటారు.ఆయన సేవలకు తాము సెల్యూట్ చేస్తున్నామంటూ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
ఈ వయసులో రామా కృష్ణ అనుకుంటూ కాలం వెళ్లదీయకుండా ఇలా ప్రజా సేవకు అంకితం అయిన నారాయణ మూర్తి గారికి మనం కూడా సెల్యూట్ చేయాల్సిందే.ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చునే యువకులకు నారాయణ మూర్తి గారిని చూసి తల దించుకోవాలి.
నారాయణ మూర్తి గారిని ఇన్సిపిరేషన్‌గా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలి.ఈ విషయాన్ని నలుగురితో షేర్ చేసుకుని నారాయణ మూర్తి గారి ద్వారా వారు కూడా ఇన్సిపిరేషన్ అయ్యేలా చేయండి.