అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సొంత ప్రజలకు, ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నారు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్.( President Donald Trump ) సుంకాల యుద్ధంతో పాటు ఉక్రెయిన్ – రష్యా వార్, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చడంతో పాటు అమెరికాలో( America ) అక్రమంగా ఉంటున్న విదేశీయులను బహిష్కరిస్తున్నాడు.
ఇక సొంత ప్రజలపైనా ట్రంప్ కఠినంగానే ఉంటున్నారు.ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని కంకణం కట్టుకున్న ఆయన ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే పలు విభాగాలను క్లోజ్ చేయడంతో పాటు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారు.ట్రంప్ చర్యల కారణంగా ఇప్పటి వరకు ఏకంగా రెండు లక్షల మంది కార్మికులు ఉద్యోగాలను కోల్పోయారు.
అటు బై ఔట్ అస్త్రం ద్వారా స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదిలి వేసేలా ట్రంప్ యంత్రాంగం పావులు కదుపుతోంది.దీని ద్వారా ఉద్యోగులు ఉద్యోగాలను తమకు తాముగా వదులుకుంటే 8 నెలల వేతం ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఖర్చు తొలగింపు లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

తాజగా అమెరికా రెవెన్యూ విభాగంలో ఏకంగా 20 నుంచి 25 శాతం సిబ్బందికి లే ఆఫ్‌లు ఇవ్వాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.అధ్యక్షుడి ఆదేశాల మేరకు యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్( US Internal Revenue Service ) అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లిపోయాయి.
పౌరహక్కుల కార్యాలయంలో దాదాపు 75 శాతం మందిని విధులను తొలగిస్తామని ఈమెయిల్స్ వెళ్లాయి.మిగిలిన వారిని ప్రత్యేక కార్యాలయం పరిధిలోకి తీసుకొస్తామని వాటిలో పేర్కొన్నారు.

కాగా.ఫెడరల్ ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని వృథా, మోసం కారణంగా చాలా డబ్బు కోల్పోయిందని డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు.గతేడాది 1.8 ట్రిలియన్ల లోటుతో పాటు దాదాపు 36 ట్రిలియన్ల అప్పు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ మెజారిటీ ఉన్న రిపబ్లికన్లు ట్రంప్ చర్యలకు మద్ధతు ఇచ్చినప్పటికీ.ప్రభుత్వ వ్యయంపై శాసనసభ రాజ్యాంగ అధికారాన్ని ట్రంప్ తగ్గిస్తున్నారని కాంగ్రెస్ డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.