ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు( SSC Results ) చివరికి ఏప్రిల్ 23 (బుధవారం)న విడుదలయ్యాయి.ఈ ఫలితాలను ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) విడుదల చేశారు.
ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్, మనమిత్ర వాట్సాప్ (9552300009), లీప్ యాప్ లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు “Hi” అని మెసేజ్ చేయాలి.
అందులో విద్యా సేవల ఆప్షన్ ఎంచుకొని, హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఫలితాలను పిడిఎఫ్ కాపీగా తక్షణమే పొందవచ్చు.

ఇక ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది.ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 81.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.ఇందులో అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 78.31% ఉండగా, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 84.09%గా ఉంది.ఇక జిల్లాల వారీగా ఉత్తీర్ణత గురించి చుస్తే.పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90% ఉత్తీర్ణత సాధించగా, అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యల్పంగా 47.64% ఉత్తీర్ణత సాధించింది.అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా., 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.2024-25 విద్యా సంవత్సరానికి గానూ మొత్తం 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాశారు.ఇందులో ఇంగ్లిష్ మీడియం 5,64,064 మంది, తెలుగు మీడియం నుండి 51,069 మంది హాజరయ్యారు.

ఇక 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్ధులతో పాటు ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చిన వారికి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.ఈ పరీక్షలు మే 19 నుంచి మే 28వ వరకు జరుగుతాయి.ఇందులకు విద్యార్ధులు ఏప్రిల్ 24 తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.అలాగే రూ.50 ఆలస్య రుసుముతో మే1 నుంచి మే 18వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.వీటితోపాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు కూడా అవకాశం కల్పించారు అధికారులు.