తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటే వారి పిల్లలను అదేరంగంలోకి తీసుకురావడం కామన్.అందుకే లాయర్ల పిల్లలు రాయర్లు, డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, యాక్టర్ల పిల్లలు యాక్టర్లుగా ఆయా రంగాల్లో రాణిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
కొంత మంది సినిమా నటులు మాత్రం తమ పిల్లలన్ని ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడకుండా పెంచుతుండగా.మరికొంత మంది తమ పిల్లలను పట్టుబట్టి మరీ ఇదే రంగుల ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు.
హీరోల కొడుకులు ఎంతో మంది హీరోలుగా పరిచయం అవుతున్నారు.హీరోయిన్ల విషయం అది కాస్త తక్కువగా ఉంది.
తమ బిడ్డలను హీరోయిన్లుగా పరిచయం చేయడానికి అంతగా ఇష్టపడ్డం లేదు.కానీ కొంత మంది ఇందుకు మినహాయింపు.
అలనాటి సినీ తారల పిల్లలు హీరోయిన్లుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్లు? ఇప్పుడు వెండి తెరకు పరిచయం అయిన వారి అమ్మాయిలు ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీదేవి – జాన్వికపూర్తెలుగు నేల నుంచి సినీ ప్రపంచంలో అడుగు పెట్టి బాలీవుడ్‌ను ఏలిన నటి శ్రీదేవి.ఆమె కూతురు జాన్వికపూర్ సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
ధడక్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేసింది.జాన్వి సినీ జీవితం విషయంలో శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.
అయినప్పటికీ తన ఫస్ట్ మూవీ చూడకుండానే చనిపోయింది.
లక్ష్మి- ఐశ్వర్య ఒకప్పుడు వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్ లక్ష్మి.
ఆమె ముద్దుల బిడ్డే ఐశ్వర్య.తన అద్భుత నటనతో మంచి హీరోయిన్‌గా ఎదిగింది.
ప్రస్తుతం ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.
లిజి- కళ్యాణి ప్రియదర్శన్ కేరళలో పుట్టి పెరిగిన నటి లిజి.
ఆమె తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది.ఆమె గారాల పట్టి కళ్యాణి ప్రియదర్శన్.
అఖిల్ తొలి చిత్రంతో ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి.
ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.
మేనక – కీర్తిసురేశ్ఒకప్పుడు తెలుగు సినీ తారగా వెలుగు వెలిగిన నటి మేనక.ఎన్నో భాషల్లో మరెన్నో సినిమాలు చేసింది.ఆమె కూతురూ కీర్తి సురేష్.
మహానటి సినిమాతో జాతీయ స్థాయి నటిగా పేరుపొందింది.పలు భాషల్లో ఎన్నో సినిమాలు చేస్తోంది.
మంజుల – వనిత, శ్రీదేవి,ప్రీత ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన నటి మంజుల.ఆమెకు ముగ్గురు బిడ్డలు.వారే వనిత, ప్రీత,శ్రీదేవి.దేవి సినిమాతో వనిత తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
ప్రీత రుక్మిణితో ఎంట్రి ఇచ్చింది.ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ తో శ్రీదేవి పరిచయం అయింది.
సంధ్య- జయలలితసినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనంటూ ఓ ప్రత్యేకత పొందిన వ్యక్తి జయలలిత.ఆమె తల్లి కూడా సినీ నటి కావడం విశేషం.జయలలిత సినిమాల్లోకి రావడానికి తల్లే కారణం.చదువులో చురుకుగా ఉండే జయలలిత తల్లి ప్రోత్సాహంతో చిన్నవయసులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్ గా గుర్తింపుపొందింది.తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది.
రాధ – కార్తిక,తులసిఎయిటీస్‌లో సినిమా ఇండస్ట్రీని ఓఊపు ఊపిన నటి రాధ.
ఆమె ఇద్దరు కూతుర్లే కార్తిక, తులసి.నాగ చైతన్య తొలి మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యింది కార్తిక.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది.తులసి మణిరత్నం కడలి మూవీతో సినిమాల్లోకి వచ్చినా సరైన గుర్తింపు పొందలేదు.
జీవిత – శివాని,శివాత్మికఒకప్పుడు రాజశేఖర్‌తో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ జీవిత.ఆ తర్వాత రాజశేఖర్ భార్యగా మారింది.వారి పిల్లలే శివాని, శివాత్మిక.వీరిద్దరూ సినిమాల్లోకి అడుగు పెట్టారు.పెద్ద కూతురు శివాని ఎంట్రీ మధ్యలో ఆగిపోయింది.చిన్న కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది.
సారిక – శృతిహాసన్, అక్షర హాసన్ సారిక బాల నటిగా కెరీర్ మొదలు పెట్టింది.ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.ఆ తర్వాత కమల్ హాసన్ ను పెళ్లి చేసుకుంది.వీరి పిల్లలే శృతి హాసన్, అక్షర హాసన్.శృతి సౌతిండియాతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది.