ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా చదవాలని తల్లీదండ్రులు పడే కష్టం అంతాఇంతా కాదు.పిల్లల చదువు కోసం తల్లీదండ్రులు ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి సైతం వెనుకాడటం లేదు.
అయితే ఒక ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల పిల్లలు బాగా చదువుకునే అవకాశాలు అయితే ఉంటాయట.బాన్సువాడలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటే పిల్లలు బాగా చదువుతారని భక్తులు నమ్ముతారు.
బాన్సువాడ( Banswada )లోని జ్ఞాన సరస్వతి( Gnana saraswati temple ) దేవాలయాన్ని దర్శించుకుంటే కుటుంబానికి సైతం మంచి జరుగుతుందని చాలామంది ఫీలవుతారు.కొంతమంది భక్తులు ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
కోరిన కోరికలను అమ్మవారు కచ్చితంగా తీరుస్తారని భక్తులు వెల్లడిస్తున్నారు.ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు 41 రోజుల దీక్షను తీసుకుంటున్నారు.
మాటలలో చెప్పలేని కష్టాలు ఉన్నవాళ్లు ఈ అలయాన్ని దర్శించుకున్న తర్వాత తమ జీవితాలు మారిపోయాయని కొంతమంది భక్తులు చెబుతున్నారు.అమ్మవారి మూల మంత్రాన్ని జపిస్తూ పూజలు చేస్తామని భక్తులు( Devotees ) వెల్లడిస్తున్నారు.అమ్మవారి ఆలయంలో ఉండి జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు.2005 సంవత్సరంలో ఈ ఆలయంలో సరస్వతీ దేవి ప్రతిష్టాపన జరిగిందని తెలుస్తోంది.
ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ ఆలయంలో గర్భాలయానికి కుడివైపున గణపతి విగ్రహం ఉంది.బస్సు మార్గం ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకోవచ్చు.ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.సంవత్సరం సంవత్సరానికి ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.బాసర సరస్వతీ దేవి ఆలయం తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయిన ఆలయం ఇదే కావడం గమనార్హం.
ఈ ఆలయంలోని అమ్మవారి మహిళల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.హైదరాబాద్ లో నివశించే వాళ్లు ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకోవచ్చు.