ఏంటి భయ్యా.. మనుషుల ఆరోగ్యంతో గేమ్స్ ఆడుకుందామనుకున్నారా?

ఇప్పుడంటే టెక్నాలజీ యుగం.కేవలం వినోదం మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక విషయాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి.

 Man Injecting Vegetables With Harmful Chemicals Video Viral Details, Artificial-TeluguStop.com

తాజాగా కూరగాయలను( Vegetables ) కృత్రిమంగా ఎలా పండిస్తున్నారో వెల్లడించే ఓ వీడియో నెట్టింట తెగ వైరల్( Viral Video ) అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి, భయానికి లోనయ్యారు.

మునుపటి రోజుల్లో రైతులు తమ పొలాల్లోనే కూరగాయలు పండించేవారు.కొంతమంది ఇంటి వద్దే కొన్ని కూరగాయలను పెంచుకుని, ఆ తాజా కూరగాయలతో ఆహారం తయారు చేసుకునేవారు.ఆ సమయంలో కూరగాయలు నిస్సందేహంగా స్వచ్ఛంగా, పోషకమైనవిగా ఉండేవి.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

నేటి రోజులలో పంట పొలాలు తగ్గిపోవడం, పట్టణీకరణ పెరగడంతో కూరగాయల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.కూరగాయలకు డిమాండ్ పెరిగిపోవడం వల్ల రైతులు అధిక దిగుబడిని అందుకునేలా వివిధ రసాయనాలను, క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారు.

ఫలితంగా ఆహారంగా తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి చిన్నపాటి బీరపాదుల్లోకి ఇంజక్షన్( Injection ) ఇస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.సహజంగా, సాధారణ పద్ధతుల్లో, పండిన కూరగాయలు పూర్తిగా ఎదగడానికి కొంత సమయం పడుతుంది.కానీ, ఈ వీడియోలో కనిపిస్తున్న రైతు చిన్నపాటి బీరకాయల పిందెల్లో ఒక రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు.

ఈ ఇంజక్షన్ వల్ల కేవలం కొన్ని రోజుల్లోనే అవి పెద్ద బీరకాయలుగా మారిపోతున్నాయి.సహజంగా ఎదిగే కూరగాయలు రెండు వారాల సమయం పడుతుంటే, ఈ రసాయన పద్ధతితో తక్కువ రోజుల్లోనే కోతకు సిద్ధమవుతున్నాయి.

అత్యవసర సమయాల్లో ఎక్కువ దిగుబడి కోసమే రైతులు ఈ రసాయనాలను ఉపయోగిస్తున్నా, వీటి ప్రభావం వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.ఇలాంటి కృత్రిమంగా పండించిన కూరగాయలను తినడం వల్ల శరీరంలో హానికరమైన రసాయనాలు చేరిపోతాయి.ఆహారానికి సంబంధించిన అలర్జీలు, జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి.ఇంకా కొంతకాలానికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది

కూరగాయలను కొనుగోలు చేసే ముందు అవి సహజంగా పండించిందేనా లేదా అనేది గమనించాలి.

మరీ ఆకర్షణీయంగా కనిపించే, అధికంగా ప్రకాశించే కూరగాయలను కొంటే అవి రసాయనాల ప్రభావంతో ఉండే అవకాశం ఎక్కువ.ఇంట్లోకి తెచ్చిన కూరగాయలను సరైన విధంగా కడిగి వాడడం మంచిది.

మొత్తానికి ఈ వైరల్ వీడియో ఒకసారి అందరికీ మేలిమి హెచ్చరికలా మారింది.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తినే ఆహారంపై అప్రమత్తంగా ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube