రాధిక. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.
ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోని అగ్రతారలు అందరితో కలిసి నటించింది.ఎన్నో అద్భుత సినిమాలు చేసి అగ్ర నటీమణిగా ఎదిగింది.1992 ఆగష్టులో ఆమెకు అమ్మాయి జన్మించింది.తన చేతులతో పాపను తీసుకుని మురిసిపోయింది.
అదే తనకు తొలి కాన్పు.ఆ పాప పేరు రయానే.
రాధిక, తన రెండో భర్త రిచర్డ్ హార్డీకి ఆ పాప జన్మించింది.అప్పుడు తను ప్రముఖ హీరోయిన్ గా కొనసాగడంతో పలువురు సినీ పెద్దలు ఆమెను కలిసి కంగ్రాట్స్ చెప్పారు.
అటు దిగ్గజ దర్శకుడు భారతీరాజా కూడా ఆమెను కలిసి అభినందనలు చెప్పాడు.అంతేకాదు.
హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రాధికకు ఓ గమ్మత్తైన విషయం చెప్పాడు.ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాధికను చూసేందుకు హాస్పిటల్ కు వచ్చిన భారతీరాజా.తనతో పాటు ఓ సినిమా స్క్రిప్టు తెచ్చుకున్నాడు.ఆమెకు ఈ కథ వినిపించాలనే ఉద్దేశంతోనే ఆయన దానిని తెచ్చాడు.ఈ విషయం రాధికకు చెప్పాడు.
ఆయన మాటలకు రాధిక ఆశ్చర్యపోయింది.నేను బిడ్డను కని సంతోషంగా ఉంటే ఇప్పుడు కథ చెప్తావా? నీకే ఏమైనా పిచ్చా? అని అడిగింది నవ్వుతూ.దానికి భారతీరాజా నవ్వుతూనే సమాధానం చెప్పాడు.ఈ కథ రాసిందే నీకోసం.నువ్వే ఈ సినిమా చేయాలని అని అడిగాడు.నిజానికి రాధిక దగ్గర భారతీరాజాకు చాలా చనువు ఉంది.
ఎందుకంటే రాధికను వెండి తెరకు పరిచయం చేసిందే తను.కిళకే పోగుమ్ రైల్ అనే సినిమాతోనే రాధిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాక.రెండు నెలలు అయ్యాయి.పాపకు పాలు ఇస్తూనే భారతీరాజా సినిమా షూటింగ్ లో పాల్గొన్నది రాధిక.తమిళనాడులోని వాదలకుండులో సినిమా షూటింగ్ కొనసాగింది.ఆ సినిమా పేరు కిళక్కు చీమయిలే.సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు పాపను తీసుకుని లొకేషన్ కు వెళ్లేది.
షాట్ అయిపోగానే వచ్చి పాప ఆలన పాలన చూసుకునేది.రాధిక శ్రమకు ఫలితం దక్కింది.
ఈ సినిమా విడుదలయ్యాక మంచి విజయం సాధించింది.