ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నిజాం నవాబులు( Nizam Nawabs ) దాదాపు వందల ఏళ్లపాటు ఈ సంస్థానాన్ని పాలించారు.వజ్రాలు లెక్కలేనంత డబ్బు బంగారం ప్యాలెస్ లు కోట్ల కొద్ది సంపద ఉన్నటువంటి రిచెస్ట్ నిజాం నవాబుకు కూడా చాలా దారుణమైన అలవాట్లు ఉంటాయని ఆయన సన్నిహితుడు వాల్టర్ మాక్టన్ తన పుస్తకం లో రాసుకున్నారు.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి( Mir Osman Ali Khan ) ఉన్న ఆ అలవాట్లు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
ఆలీ ఖాన్ దాదాపు 30 ఏళ్ల పాటు ఒకే టోపీని ధరించారు.
దానికి దారుణంగా చుండ్రు నిండిపోయి ఉండేది.అలాగే ఆయన్ని కలవడానికి వచ్చిన వారు ఎవరైనా కూడా మితంగానే ఆహారాన్ని తీసుకోవాల్సి వచ్చేది ఒక చాయ్ ఒక బిస్కెట్ మాత్రమే ఇచ్చేవారు.
ఆ విధంగా ఆయన డబ్బును అలా చేయాలని చూసేవారట చాలా ఖరీదైన ప్యాలెస్ లో ఉండే మీరు అలీ ఖాన్ తన రూమును మాత్రం చాలా దారుణంగా ఉంచుకునే వారట మురికి గది లా ఉండేదట.సీసాలు, దుమ్ము, సాలీడు పురుగులు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉండేదట.

ఇక ఆయనను కలవడానికి విదేశాల నుంచి ఎవరైనా వస్తే సిగరెట్( Cigarette ) ఆఫర్ చేస్తే పెట్టలోని నాలుగైదు సిగరెట్స్ తీసుకొని తన చార్మినార్ సిగరెట్ పెట్టలో పెట్టుకునే వారట.ఇక ఆయన మాత్రం చాలా చవకైన 12 పైసల సిగరెట్ మాత్రమే తాగే వారట.ఆయన దగ్గర ఉన్న నాణెం ( Coin ) ఒకసారి కింద పడిపోతే వందల వేల కోట్ల ఆస్తి ఉన్న అలీ ఖాన్ కిందపడి దొర్లుతూ ఆ కాయిన్ వెనుక వెళ్లిపోయి అది దొరికేంతవరకు శాంతించలేదట.అంత పిసినిగొట్టు రాజును తను వేరే ఎక్కడ, ఎప్పుడూ చూడలేదంటాడు మాల్టన్.

ఇక డజన్లకు పైగా రూములు ఉన్నా కూడా తాను ఎక్కడో మూలకు ఉన్న మురికి గదిని కేటాయించారని చాలా బాధపడ్డారు అంతేకాదు రూమ్ లో పాత అలమారా, దస్తావేజులు, సాలీడు గూడు లాంటివి ఉండేవట.ఇక ఆయనకు ఒక్కోసారి వింత అలవాటు కూడా ఉండేదట.ఆయన గట్టిగా అరిస్తే 50 గజాలకు పైగా దూరంలో ఉన్న వారి కూడా వినిపించేదట.తెల్లటి పైజామా ధరించి వాటికి మెడ దగ్గర గుండీలు పెట్టుకునేవారు కాదట.
పసుపురంగంలో ఉన్న సాక్సులు ధరించే వారట ఒక్కోసారి కింద పైజామా కూడా వేసుకోకుండా తిరిగేవారట.