తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న వ్యక్తి దిల్ రాజు.సినీ నిర్మాణ రంగానికి ఆయన ఓ మంచి గౌరవాన్ని తీసుకొచ్చారు.
దిల్ రాజు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే దాని వెనుక ఇద్దరు వ్యక్తుల శ్రమ ఉంది.వారెవరో కాదు.
శిరీష్, లక్ష్మణ్.వీరిద్దర పక్కా ప్లాన్ ప్రకారమే దిల్ రాజు ముందుకు సాగేవాడు.
అందుకే చాలా సినిమాలకు ఈ ముగ్గురు పేర్లు పక్కపక్కనే కనిపిస్తాయి.దిల్ రాజుకు కుడి ఎడమ భుజాలుగా కొనసాగారు.
శిరీష్ సినిమా నిర్వహణ వ్యవహారాలు చూసుకునేది.లక్ష్మణ్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు నిర్వర్తించేవారు.అందుకే దిల్ రాజు ఎక్కడున్నా.ఆయన సినిమాలకుసంబంధించి పక్కా లెక్కలతో రావాల్సిన డబ్బులు ఇంటికి వచ్చేవి.
అయితే దిల్ రాజుతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చాయి.ఈ ఇద్దరూ అతడి నుంచి విడిపోయారు.
మొదట్లో దిల్ రాజు చాలా ఇబ్బందులు పడ్డాడు.దిల్ రాజుకు చెందిన చాలా సినిమాలు ఫ్లాప్ లుగా మిగిలిపోయాయి.
అంతేకాదు.లక్ష్మణ్ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మొదలు పెట్టాడు.
దిల్ రాజుకు పోటీగా మారాడు.లక్ష్మణ్ విడుదల చేసిన తొలి మూవీ జాతిరత్నాలు ఓరేంజిలో సక్సెస్ అయ్యింది.
దీంతో నిర్మాతలకు లక్ష్మణ్ పై నమ్మకం పెరిగింది.చాలా సినిమాలు ఆయన దగ్గరకు చేరాయి.

దిల్ రాజు అంటే గిట్టని చాలా మంది నిర్మాతలు లక్ష్మణ్ ను డిస్ట్రిబ్యూటర్ గా ప్రమోట్ చేశారు.డిస్ట్రియూషన్ లో దిల్ రాజు కంటే లక్ష్మణే గొప్ప అనే స్థాయికి తీసుకొచ్చారు.అయితే లక్ష్మణ్ చేసిన కొన్ని తప్పుల మూలంగా నిర్మాతలు మళ్లీ దిల్ రాజు వైపు చూస్తున్నారు.ఇంతకీ తను చేసిన తప్పు ఏంటంటే.టక్ జగదీష్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను లక్ష్మణ్ కొనుగోలు చేశాడు.అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
ఈలోగా అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది.దీంతో నిర్మాతలతో పాటు లక్ష్మణ్ కూడా అటు వైపే మొగ్గు చూపాడు.
అయితే థియేటర్ల సంఘం మాత్రం ఎవరైతే అక్టోబర్ వరకు తమ సినిమాలను ఓటీటీకి ఇస్తారో వారిని ఎంకరేజ్ చేయమని తేల్చి చెప్పింది.ఈ నేపథ్యంలో లక్ష్మణ్ మీద థియేటర్ల ఓనర్లు ఆగ్రహంగా ఉన్నారు.
అటు కొత్తగా దిల్ రాజు పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ థియేటర్ల సంఘానికి దగ్గరయ్యాడు.