Diabetes : మధుమేహుల్లో షుగర్ ను నార్మల్ చేసే టాప్ అండ్ బెస్ట్ కషాయాలు ఇవే!

దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం( Diabetes ) ఒకటి.దీన్నే డయాబెటిస్, చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తుంటారు.పలు నివేదికల ప్రకారం.40 ఏళ్ల నాటి తో పోలిస్తే ప్రస్తుతం మధుమేహం వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగింది.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఊబకాయం తదితర కారణాల వల్ల ప్ర‌తి ఏడాది కోట్లాది మంది మధుమేహం బారిన పడుతుంటారు.కారణం ఏదైనా ఈ వ్యాధి ఉన్న వారికి షుగర్ లెవెల్స్( Sugar levels ) ను నార్మల్ చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది.

 These Are The Top And Best Infusions That Normalize Sugar In Diabetic Patients-TeluguStop.com

కానీ కొన్ని కొన్ని కషాయాలు మాత్రం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.ఈ నేపథ్యంలోనే మధుమేహుల్లో షుగర్ ను నార్మల్ చేసే టాప్ అండ్ బెస్ట్ కషాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Diabetes, Diabetic, Tips, Herbal, Jamunseeds, Kashayalu, Latest, Pudina K

నేరేడు గింజల కషాయం.మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది.నిత్యం నేరేడు గింజల కషాయాన్ని తీసుకుంటే రక్తంలో షుగర్ నిల్వలు తగ్గడం ప్రారంభం అవుతాయి.నేరుడు గింజ‌ల్లో జంబోలిన్, జాంబోసిన్ అనే పదార్థాలు ఉంటాయి.ఇవి రక్తంలో చక్కెర విడుదల ప్రక్రియను నెమ్మదిగా మార్చి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.ఫలితంగా షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.

Telugu Diabetes, Diabetic, Tips, Herbal, Jamunseeds, Kashayalu, Latest, Pudina K

పుదీనా కషాయం డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.పుదీనా లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి.ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక కప్పు పుదీనా కషాయాన్ని తీసుకుంటే.అందులో ఉండే పలు సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.ఇక పసుపుతో తయారు చేసిన కషాయం తీసుకోవడం వల్ల కూడా మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.పసుపు కషాయం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

పసుపు కషాయాన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల షుగర్ నార్మల్ అవుతుంది.పైగా పైగా పసుపు కషాయం రోగనిరోధక శక్తి( Immunity )ని పెంచుతుంది.

ఇన్ఫెక్షన్లతో పోరాడే శ‌క్తిని అందిస్తుంది.పసుపు కషాయం జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది.

క్యాన్సర్ వచ్చే ముప్పును సైతం త‌గ్గిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube