వయసు పైబడే కొద్దీ వైట్ హెయిర్ వస్తే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.కానీ.
కేవలం పాతిక, ముప్పై ఏళ్ల వయసులోనే నల్లటి జుట్టు తెల్ల తెల్లగా మారుతుంటే.దానిని దాచుకోలేక, నివారించుకోలేక తెగ సతమతమైపోతూ ఉంటారు.
ఈ క్రమంలోనే కొందరు మనోవేదనకు గురై మానసికంగా కూడా కృంగిపోతుంటారు.అయితే చిన్న వయసులో వైట్ హెయిర్ రావడానికి.
కాలుష్యం, ఆహారపు అలవాట్లు, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్ వాడకం, ఒత్తిడి, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత, పోషకాల కొరత ఇలా చాలా కారణాలు ఉంటాయి.
కారణం ఏదైనా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే.
వైట్ హెయిర్‌ను సమర్థ వంతంగా నివారించుకోవచ్చు.మరి వైట్ హెయిర్ సమస్యే ఉండకూడదంటే ఏం చేయాలో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బాదం ఆయిల్, రెండు స్పూన్ల కొకొనట్ ఆయిల్, రెండు స్పూన్ల ఆముదం, మూడు చుక్కలు టీట్రీ ఆయిల్ వేసుకుని కలిపి కేవలం పది సెకెండ్ల పాటు హిట్ చేయాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తల మరియు జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకుని వదిలేయాలి.
రెండు లేదా మూడు గంటల అనంతరం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్, రెండు స్పూన్ల మందార పువ్వుల పొడి, రెండు స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ కరివేపాకు పొడి, అర కప్పు పెరుగు మరియు పావు స్పూన్ రోస్మెరీ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని జుట్టు మొత్తానికి పట్టించాలి.ఆపై షవర్ క్యాప్ పెట్టుకుని.నలబై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
వారంలో రెండే రెండు సార్లు ఇలా చేశారంటే.కేవలం కొద్ది రోజుల్లోనే వైట్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు జుట్టు రాలడం, పొడి బారడం వంటి సమస్య సైతం తగ్గు ముఖం పట్టి.
కేశాలు హెల్తీగా మారతాయి.