సమ్మర్ స్పెషల్.. వెయిట్ లాస్ కు బెస్ట్ జ్యూస్ ఇది..!

వెయిట్ లాస్( weight loss ) అవడం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఒక గోల్ అయిపోయింది.మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.? స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారా.? నిత్యం చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది.ఈ జ్యూస్ సమ్మర్ లో ఆరోగ్యానికి అనుకూలంగా, వెయిట్ లాస్ కు మద్దతుగా నిలుస్తుంది.

 This Is The Best Juice For Weight Loss! Healthy Juice, Weight Loss, Weight Loss-TeluguStop.com

మరి ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో అరకప్పు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు( Cabbage pieces ) వేసుకోవాలి.

అలాగే అరకప్పు కీర దోసకాయ ముక్కలు, ఒక కప్పు ఆపిల్ ముక్కలు( apple slices ), రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని తాగేయడమే.కావాలి అనుకుంటే ఈ జ్యూస్ లో మీరు నానబెట్టిన సబ్జా గింజలను కూడా కలుపుకోవచ్చు.

ఈ ఆపిల్ కుకుంబర్ క్యాబేజీ జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా శరీర మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను రిమూవ్ చేస్తుంది.అదనపు కొవ్వును కరిగిస్తుంది.

నిత్యం ఈ జ్యూస్ ను తాగారంటే మీరు మీ బరువు తగ్గే లక్ష్యాన్ని ఇంకాస్త వేగంగా చేరుకోవచ్చు.

-Telugu Health

అంతేకాకుండా ఈ జ్యూస్ కంటి చూపును షార్ప్ గా మారుస్తుంది.సమ్మర్ లో డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తుంది.ఒంట్లో అధిక వేడిని తొలగిస్తుంది.

మరియు ఈ ఆపిల్ కుకుంబర్ క్యాబేజ్ జ్యూస్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో కూడా అద్భుతంగా తోడ్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube