ఆ ఊరిలో కోరిన కోరికలు తీరితే ఏకంగా.. దేవాలయాలు కట్టేస్తారు..!

ఈ గ్రామంలో కోరిన కోరికలు తీరితే దేవాలయాలను( Temples ) నిర్మిస్తారు.దీంతో ఆ గ్రామం నిండా దేవాలయాలే ఉన్నాయి.

 People Built Temples After Their Wishes Fulfilled At Vellulla Village Of Metpall-TeluguStop.com

గ్రామంలో 120 కి పైగా దేవాలయాలు ఉన్నాయి.సాధారణంగా కోరిన కోరికలు తీరని దేవుడిని ప్రార్థించడం సహజం.

కోరిన కోరికలు తీరితే కొబ్బరికాయ కొట్టడం లేదంటే తలనీలాలు సమర్పించడం లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.అయితే ఈ గ్రామంలో మాత్రం కోరిన కోరికలు తీరితే ఏకంగా దేవాలయాలను నిర్మిస్తున్నారు.

ఈ దేవాలయాల గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జగిత్యాల జిల్లా( Jagityala ) మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామం లో( Vellulla Village ) 5000 మంది జనాభా ఉంటుంది.

ఈ గ్రామంలో 95% పైగా వ్యవసాయం చేసుకొని జీవిస్తారు.ఈ గ్రామంలో ఆధ్యాత్మికత దైవ చింతన ఎక్కువగానే ఉంటుంది.పంట పొలాలు పచ్చని పైరులతో ఆ గ్రామం కలకలలాడుతూ ఉంటుంది.గతం లో అన్ని గ్రామాల్లో లాగా ఇక్కడ కూడా రెండు, మూడు దేవాలయాలు ఉన్నాయి.

ఇక్కడ ఉన్న దేవాలయాలలో స్థానికులు పూజలు చేసేవారు.ఏమైనా కోరిన కోరికలు తీరితే దేవాలయం నిర్మిస్తామని మొక్కుకునేవారు కోరికలు తీరితే దేవాలయం నిర్మించేవారు.

Telugu Temples, Bhakti, Devotional, Hanuman Temples, Jagityala, Metpalli, Vellul

ఆలయం నిర్మించే వారికి చాలామందికి అనుకున్నది జరిగింది.దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించారు.ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం ఈ గ్రామంలో 120 వరకు దేవాలయాలు ఉన్నాయి.అందులో హనుమాన్ దేవాలయాలు( Hanuman Temples ) వరకు ఉన్నాయి.రోడ్డుకు ఇరువైపులా దేవాలయాలు దర్శనమిస్తాయి.అంతేకాకుండా ఆ గ్రామ శివారులో వివిధ దేవాలయాలు ఉన్నాయి.

ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతాయి.

Telugu Temples, Bhakti, Devotional, Hanuman Temples, Jagityala, Metpalli, Vellul

ఆధ్యాత్మిక గ్రామాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.ఈ గ్రామంలో ప్రతిరోజు జాతర, శ్రావణమాసం ఇతర పర్వదినాలలో వేడుకలు జరుగుతాయి.గ్రామంలో ఇన్ని దివానాలు ఉండడం చాలా అరుదు.

ఇక్కడే ఎలాంటి కరువు దేవాలయాలు రెండు పంటలు పండుతున్నాయి.చాలా మందికి మంచి జరగడంతో దేవాలయాలు నిర్మించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube