మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించిన వారికి సకల దోషాలు దూరమవుతాయి.నవగ్రహాలలో ఒకరైన అంగారకునికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం.
మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల అంగారకుని ద్వారా కలిగే దోషాలు బాధల నుంచి విముక్తి పొందవచ్చు.మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే ఎలా పూజించాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మంగళవారం సూర్యోదయం కాగానే నిద్రలేచి స్నానమాచరించి ఎర్రటి దుస్తులు ధరించి ఆంజనేయ స్వామిని పూజించాలి.ఆంజనేయ స్వామికి పూజలు చేసి, ఉపవాసం ఉండే దంపతులకు సంతానం తొందరగా కలుగుతుంది.
రాత్రి ఉప్పులేని అన్నం తినాలి.

మంగళవారం నాడు స్వామివారికి సింధూరంతో పూజలు చేయాలి.అలాగే ఎరుపు రంగు పూలతోనూ, ఎరుపు రంగు నైవేద్యం అంటే కేసరి లాంటిది నైవేద్యంగా సమర్పించిన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, సకల పాప దోషాలు నుంచి విముక్తి కలుగుతుంది.
ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజించడం లేదా తమలపాకులతో అభిషేకం చేయడం ద్వారా సుఖ శాంతులు కలుగుతాయి.తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు.వీటితో స్వామివారిని పూజించడం ద్వారా నాగ దోషాలు కూడా తొలగిపోతాయి.తమలపాకు హారంతో పూజించడం వల్ల మంత్ర పీడ దోషాలు తొలగిపోతాయి.
మంగళవారం రోజున ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని, హనుమాన్ చాలీసా చదివితే ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం అవుతుంది.మంగళవారం స్వామివారికి వడల హారం, తులసి హారాలతో పూజించడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.
ఆంజనేయస్వామికి ఇష్టమైనవి మందారం పూలు వీటితో పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.