సంక్రాంతి నాడు ఇంటి ముందుకు గంగిరెద్దును ఎందుకు తీసుకొస్తారు?

సంక్రాంతి పండుగ నాడు ఇళ్ల ముందుకు గంగిరెద్దులు రావడం మన అందరికీ తెలిసిన విషయమే.

రంగు రంగుల శాలువాలు, బట్టులు కప్పిన గంగిరెద్దును వెంట పెట్టుకొని సన్నాయి ఊదుకుంటూ ఊరూరా.

ఇంటింటా తిరిగి డబ్బులో, ధాన్యపు గింజలో అడుక్కుంటారు.అససలు వారెవరు సంక్రాంతి నాడే వారెందుకు మన ఇళ్ల ముందుకు వస్తారో తెలుసుకుందాం.

భోగ భాగ్యాలను వెంట తీసుకొచ్చే సంక్రాంతి పండుగ నాడు హరిదాసులు, గంగిరెద్దులు ఇళ్ల ముందుకు రావడం ఆనవాయితీ.వచ్చిన వారిని లేదనకుండా పంపడం మన సంప్రదాయం.

ఎంత పేద వాళ్లయినా సరే ఉన్నంతలో వాళ్లకి ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటారు.కొందరైతే ఇంటి ముందుకొచ్చిన గంగిరెద్దులపై చిన్న పిల్లలను ఎక్కిస్తూ ఆనంద పడిపోతుంటారు.

Advertisement

వచ్చిన ఆ చేత ఆశీర్వాదాలు కూడా ఇప్పించుకుంటారు.

గంగిరెద్దు ముందు వెనకాల చెరో ప్రమదునితో ఎత్తైన మూపరం ఉంటుంది.అది శివలింగం ఆకృతిని గుర్తు చేస్తూ.శివునితో హా తాను సంక్రాంతి సంబరాలకు హాజరు అయ్యానని చెప్పేందుకు సంకేతంగానే గంగిరెద్దు ఇంటి ముందుకు వస్తుందట.

ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు వేసిన ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మ బద్ధం అయినైదని అర్థం అంట.ఆ నేల ఆవుకి సంకేతం.ఆ నేల నుంచి వచ్చిన పంటలకు గుర్తుగా పెద్దలు చెబుతుంటారు.

మీరు చేసే దానమంతా ధర్మబద్ధమైనదేనంటూ.దానిని మేము ఆమోదిస్తున్నామంటూ ఇంటింటికీ తిరిగి చెప్పడానికే గంగిరెద్దులను ఇంటింటా తిప్పుతారంట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 17, శుక్రవారం, మార్గశిర మాసం 2021
Advertisement

తాజా వార్తలు