సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదంలో చిన్నారి మార్క్ గాయపడ్డారు.
ఇక ఈ విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా చిన్నారికి త్వరగా నయం కావాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.ఇక ఈ విషయం తెలిసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పర్యటనలను పూర్తి చేసుకొని సింగపూర్ బయలుదేరి వెళ్లారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన కొడుకు ఆరోగ్యం గురించి మొదటిసారి స్పందించారు.ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదం అంటే చాలా చిన్న ప్రమాదమని అనుకున్నాను కానీ మరి ఇంతలా ఉంటుందని ఊహించలేదని తెలిపారు.ఈ ప్రమాదంలో బాబు కాళ్లకు చేతులకు గాయాలు అయ్యాయని అలాగే ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడం వల్ల ఇది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి అంటూ పవన్ కాస్త ఎమోషనల్ అయ్యారు .

ప్రస్తుతం మార్క్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వైద్యులు తనకి బ్రంకోస్కోపీ చేస్తున్నారని, ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని అసలు ఊహించలేదని తెలిపారు.తన పెద్ద కుమారుడు అకీరా(Akira) పుట్టినరోజు నాడు చిన్న కుమారుడు మార్క్ కు ఇలా జరగడం దురదృష్టకరం అంటూ పవన్ కళ్యాణ్ తెలియచేశారు.ఇలా పవన్ తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి ఈ ప్రమాదం గురించి ఆరా తీసినట్టు తెలుస్తుంది.