నిద్ర. దీన్ని ఇష్టపడని వారుండురు.ముఖ్యంగా మనిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజులు జీవిస్తాడు.కానీ, నిద్ర లేకపోతే మాత్రం జీవించలేడు.పిల్లలైనా, పెద్దలైనా సంపూర్ణంగా నిద్రపోతేనే ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండగలరు.ఆరోగ్య జీవనానికి అవసరమయ్యే నిద్ర.
తక్కువైతే చాలా సమస్యలు వస్తుంటాయి.కానీ, ఇక్కడ మరో విషయం ఏంటంటే.
నిద్ర ఎక్కువైనా అనర్థాలే ఎదురుఅవుతాయి.సాధారణంగా కొందరు సమయం దొరికితే చాలు నిద్ర పోతుంటారు.
కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర ఉంటే సరిపోతుంది.అంతకు మించి నిద్రపోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేయండి.మధుమేహం.
ఇటీవల కాలంలో ఈ సమస్య చాలా మందిని కలవర పెడుతోంది.ఎందుకంటే, మధుమేహం ఒక్క సారి వచ్చిందంటే.
జీవితకాలం ఉంటుంది.జీవితకాలం మందులు వాడాల్సి వస్తుంది.
అయితే మధుమేహం రావడానికి అధిక నిద్ర కూడా ఒక కారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పాటు నిద్రించడం వల్ల బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది.ఎనిమిది గంటల పడుకున్న వారికంటే.అంతకన్నా ఎక్కువ సమయం పడుకున్న వారిలోనే హార్ట్ స్ట్రోక్‌లు ఎక్కువట.
ఇక నిద్రలేమి వల్ల డిప్రెషన్ కు గురి అవుతారన్న విషయం తెలిసిందే.
అయితే అధిక నిద్ర వల్ల డిప్రెషన్, తలనొప్పి సమస్యలు ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే. అధిక నిద్రకు చెక్ పెట్టాలి.
అలా అని నిద్ర పోవడమే మానెయకూడదు.అలా చేసినా కూడా ఆనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
అందుకే రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం నిద్రించాలి.అలాగే ఆల్కహాల్, సిగరెట్స్‌కు దూరంగా ఉండాలి.
ప్రతి రోజు పోషకాహరం తీసుకోవడంతో పాటు వ్యాయమం చేయాలి.తద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు.