టాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వస్తున్న సునైనా ఎందుకు వెనక్కి పంపిస్తుంది..!

ఇండస్ట్రీలో చాలామంది వాళ్లకంటూ ఓ గుర్తింపు రావడం కోసం తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు.కొందరు హీరోలుగా సక్సెస్ అయితే కొందరు కామెడీయన్ గా ఇంకొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోతు ఉంటారు.

 Tollywood Child Artist Baby Sunaina Movie Career, Rajendra Prasad, Chiranjeevi,-TeluguStop.com

వీళ్లు ఇలా ఉంటే కొందరైతే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చి వాళ్ళకంటూ గుర్తింపు సాధించుకుంటారు అలాంటి వారు కొందరు పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా మారతార.అందులో శ్రీదేవి, మీనా, రాశి లాంటి వారు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు సాధించారు.

అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అందరు హీరోలు హీరోయిన్లుగా మారతారని గ్యారెంటీ లేదు అందుకు ఉదాహరణగా సౌందర్య లీడ్ రోల్ లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అమ్మోరు సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికీ పరిచయమైన సునైనా బాదం నీ చెప్పుకోవచ్చు.

ఆమె అమ్మోరు సినిమా లో దేవత గా నటించి అందరి మన్నలను పొందింది.

ఆ సినిమాలో సౌందర్యని ఇంట్లో వాళ్ళందరూ బాధిస్తుంటే కాపాడే దేవతగా వచ్చే క్యారెక్టర్లో సునైనా అద్భుతంగా చేసిందనే చెప్పాలి.ఎక్స్ప్రెషన్స్ కి అచ్చం దైవాన్ని చూసినట్టు అనిపించింది అని అప్పట్లో జనాలు అనుకున్నారు అంటే ఆ క్యారెక్టర్ తో ఆమె ఎంత మాయ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే సునైనా కి అమ్మోరు ఫస్ట్ సినిమా కాదు ఆమె రెండున్నర సంవత్సరాల వయసులోనే మనసు మమత అనే సినిమాలో నటించింది.ఆమెకి ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు చిరంజీవి సినిమా నడుస్తున్న ఒక థియేటర్ కి చిరంజీవి గారు వస్తే వాళ్ళ అన్నయ్య పక్కనే ఉన్న సునైనా చిరంజీవి దగ్గరికి తీసుకెళ్ళమనీ చెప్పగా సునైనా వాళ్ళ అన్నయ్య తనని చిరంజీవి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు సునైనా చిరంజీవితో మీసినిమాలో మీ పక్కన హీరోయిన్ గా నటిస్తానని చెప్పిందట దాంతో చిరంజీవి గారు నవ్వి ఆమెని ఎత్తుకున్నారని చెప్పింది.

Telugu Baby Shamili, Baby Sunaina, Chiranjeevi, Rajendra Prasad, Sunaina Career,

అయితే చిరంజీవి గారు రీ ఎంట్రీ ఇచ్చింది తన కోసమే అని వీలైతే తన పక్కన ఒక చిన్న క్యారెక్టర్ లో నటించాలని ఉందని తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. ఓ బేబీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూతురు గా సునైన నటించి మంచి పేరు సంపాదించింది.అయితే ప్రస్తుతం సునైనా కి సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ తను సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు అందుకే షార్ట్ ఫిలిమ్స్,వెబ్ సిరీస్ లో చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటున్నారు.ఆమె అంతకుముందు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,ఆర్ జె గా, రైటర్ గా కూడా వర్క్ చేశారు.

బాహుబలి సినిమాలో కాలకేయ వాడిన లాంగ్వేజ్ ని ఉపయోగించి ఆమె చెప్పిన డైలాగులు యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యాయి.ఆ వీడియో కి రెండు మిలియన్ లా వ్యూస్ వచ్చాయి.

అలాగే ఆమె చేసిన ఫ్రస్ట్ టెడ్ ఉమెన్ అనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు.అయితే చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలు, హీరోయిన్లు అవుతుంటే తను మాత్రం యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేస్తుంది.

Telugu Baby Shamili, Baby Sunaina, Chiranjeevi, Rajendra Prasad, Sunaina Career,

ఈ మధ్య ఓ బేబీ మూవీతోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ తేజ ప్రస్తుతం జాంబి రెడ్డి సినిమాతో సోలో హీరోగా సక్సెస్ కూడా కొట్టాడు.ఒకప్పుడు డు బాలాదిత్య కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి హీరోగా కొన్ని సినిమాలు చేసి అనతి కాలంలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయాడు.అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తో పాపులర్ అయిన అక్కచెల్లెళ్ళు షాలిని, బేబీ షామిలీ లు కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.అందులో షాలిని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని హీరో అజిత్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు వాళ్ళ చెల్లి అయినా బేబీ షామిలి మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది ఆనంద్ రంగ దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ఓయ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్లు కొంతమంది హీరోలుగా హీరోయిన్స్ గా సక్సెస్ అయినప్పటికీ చాలామంది సక్సెస్ కాలేదనే చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube