ఈ ఏడాది 2024లో చాలా మంది హీరోల డైరీల్లో విడుదల మాటే కనిపించలేదు.అసలు ఆ సూచనలు కూడా కనిపించడం లేదు.2025లో విడుదల అవుతాయేమో అన్న సూచనలు కనిపిస్తున్నాయి.ఇంతకీ ఆ హీరోలు ఎవరు అన్న విషయానికి వస్తే.
ఏడాదికి ఒకటికి రెండు సినిమాలతో సినీప్రియుల్ని అలరించే హీరోల్లో నాగచైతన్య, నితిన్, సాయితేజ్, అడివి శేష్( Naga Chaitanya, Nitin, Saitej, Adivi Sesh ) తదితరులు ముందు వరుసలో ఉంటారు.వీళ్ల సినీ ప్రయాణంలో విరామాలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పాలి.
కానీ ఈసారి వీళ్లంతా ఒక్క విడుదల కూడా లేకుండానే 2024 కు వీడ్కోలు పలకనున్నారు.అలాగని వీళ్లు ఏడాది అంతా ఖాళీ గా లేరు.ఒకటికి రెండు చిత్రాలతో సెట్స్ పై తీరిక లేకుండానే గడిపారు.
ఇవన్నీ వచ్చే ఏడాది వరుసగా తెరపైకి రానున్నాయి.
కథానాయకుడు నాగచైతన్య గతేడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు.ఆ వెంటనే చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాని పట్టాలెక్కించారు.
నిజానికి అది ఈ నెలలోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది.కానీ, చిత్రీకరణ ఆలస్యమవడం వల్ల దాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 కు వాయిదా వేశారు.
ఇక హీరో నితిన్ గత ఏడాది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్( Extraordinary Man ) సినిమాతో బాక్సాఫీస్ ముందు సందడి చేశారు.ఈ క్రిస్మస్ బరిలో రాబిన్‌హుడ్ వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా కొన్నికారణాల వల్ల కొత్త ఏడాదికి వెళ్లిపోయినట్లు సమాచారం.నితిన్ ప్రస్తుతం దీనితో పాటు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తమ్ముడు అనే చిత్రం చేస్తున్నారు.
కొత్త ఏడాది ఆరంభంలో వేణు యెల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాని మొదలు పెట్టనున్నారు.

ఈ రెండూ కూడా వచ్చే ఏడాదిలోనే తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది.ఇక అడివి శేష్ చివరగా రెండేళ్ల క్రితం వచ్చిన మేజర్, హిట్ 2 ( Major, hit 2 )సినిమాలతో తెరపై కనువిందు చేశారు.ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని గూఢచారి సినిమాకి సీక్వెల్‌గా జి2 సినిమాని, దీనితో పాటు డెకాయిట్: ఎ లవ్‌స్టోరీ ని పట్టాలెక్కించారు.పాన్ ఇండియా స్థాయిలో ముస్తాబవుతున్న ఈ రెండు సినిమాలు కొన్నాళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.దీంతో ఈ ఏడాది కూడా శేష్ నుంచి కొత్త విడుదల కనిపించలేదు.
ఈ రెండూ వచ్చే ఏడాదిలోనే తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది.అలాగే హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది డెవిల్ అమిగోస్ అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలో ఆశించే స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయాయి.ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక సినిమా కూడా విడుదల కాలేదు.
ఆయన ప్రస్తుతం తన 21వ సినిమాతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు.ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది.

ఇది వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఇక సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) విషయానికి వస్తే.బ్రో,విరూపాక్ష లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సాయి ధరమ్ తేజ్ ఈ సంవత్సరంలో ఒక్క సినిమాను కూడా బయటకు తీసుకురాలేకపోయారు.అలాగని ఖాళీగానూ లేరు.ప్రస్తుతం కె.పి.రోహిత్ దర్శకత్వంలో సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక నాగశౌర్య కూడా ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో దృష్టి సారించిన విషయం తెలిసిందే.ఈ ఏడాది తన నుంచి కొత్త చిత్రమేదీ బయటకు రాలేదు.ఆయన ఇటీవలే రామ్ దేశిన దర్శకత్వంలో కొత్త సినిమాని పట్టాలెక్కించారు.ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెరపైకి రానుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు పూర్తి కావొస్తుంది.గత ఏడాది ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకున్నా చేదు ఫలితమే ఎదురైంది.
దీంతో ప్రస్తుతం ఆయన మళ్లీ తెలుగుపై దృష్టి పెట్టారు.సాయి శ్రీనివాస్ ఇప్పుడు తెలుగులో ‘టైసన్ నాయుడు భైరవం చిత్రాలతో సెట్స్ పై బిజీగా ఉన్నారు.
అలాగే వీటితో పాటు మరో మూడు ప్రాజెక్ట్‌లకు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది.వీటిలో దాదాపు మూడు సినిమాలు కొత్త ఏడాదిలోనే వచ్చే అవకాశం కనిపిస్తోంది.