కెనడాలో ఇటీవల దుండగుల చేతిలో హత్యకు గురైన 20 ఏళ్ల హర్షన్‌దీప్ సింగ్( Harshandeep Singh ) అనే భారతీయ విద్యార్ధి నివాళి కార్యక్రమాలు ఎడ్మాంటన్‌లో జరిగాయి.పంజాబీలు సహా కెనడాలో స్థిరపడిన భారతీయ కమ్యూనిటీ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైంది.
సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగంలో చేరిన మూడో రోజే అతను ప్రాణాలు కోల్పోయాడు.ఏడాది క్రితం భారత్ నుంచి కెనడాకు వచ్చిన హర్షన్ .ఈ నెల ప్రారంభంలో కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.తీవ్రగాయాల పాలైన హర్షన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.
ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ హర్షన్ దీప్ ( Harshan Deep )కుటుంబం అతను కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది .కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగింది.

హర్షన్ మరణానికి గాను ఇవాన్ రైన్, జుడిత్ సాల్టోక్స్‌లను( Evan Raine , Judith Salteaux ) పోలీసులు అరెస్ట్ చేశారు.ఆల్బెర్టా ఫస్ట్ రెస్పాండర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జెర్రీ గల్లిఫోర్డ్( Association President Jerry Galliford ) .హర్షన్ సింగ్‌కు నివాళి సందర్భంగా హానర్ గార్డ్‌ను ఏర్పాటు చేశారు.చాలా మంది హానర్ గార్డ్‌లో పాల్గొనాలని కోరుకోవడంతో భారీ స్పందన వచ్చినట్లు గల్లిఫోర్డ్ తెలిపారు.
మరోవైపు.హర్షన్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ముగ్గురు సభ్యుల ముఠాలోని ఒక వ్యక్తి సింగ్‌ను మెట్లపై నుంచి క్రిందకి తోస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.

కెనడాలో రోజుల వ్యవధిలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఈ మేరకు కెనడాలోని భారతీయ మిషన్‌లు, ఇండియన్ కమ్యూనిటీతో కేంద్ర విదేశాంగ శాఖ టచ్‌లోకి వెళ్లింది.ఈ నెల ప్రారంభంలో పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్ తన రూమ్ మెట్ చేతిలోనే హత్యకు గురయ్యాడు.
ఆ తర్వాత డిసెంబర్ 6న హర్షన్‌దీప్ సింగ్‌ను ఓ ముఠా దారుణంగా కాల్చి చంపింది.ఆ తర్వాతి రోజే పంజాబ్‌కే చెందిన రితిక్ రాజ్‌పుత్‌పై చెట్టు కూలిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
వరుస ఘటనలతో కెనడాలోని భారతీయ కమ్యూనిటీ బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.







