ఈ ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. తెలుసా?

బిళ్ళ గన్నేరు.( Billa Ganneru ) పల్లెటూర్లలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో ఉండే మొక్కల్లో ఇది ఒకటి.

 White Hair Can Be Turned Black With These Leaves Details, White Hair, Black Hai-TeluguStop.com

ఈ మొక్క పువ్వులు వైట్ మరియు పింక్ కలర్ లో ఉంటాయి.బిళ్ళ గన్నేరు పువ్వులను పూజకు ఉపయోగిస్తారు.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.బిళ్ళ గన్నేరు ఒక ఔషధ మొక్క.

ఈ మొక్క నుంచి వచ్చే పువ్వులు, ఆకులు, కొమ్మలు అన్నిటిలోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి.ముఖ్యంగా బిళ్ళ గన్నేరు ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఇటీవల రోజుల్లో ఎంతోమంది వైట్ హెయిర్( White Hair ) సమస్యతో బాధపడుతున్నారు.వైట్ హెయిర్ అనేది వృద్ధాప్యానికి సంకేతం.ఈ నేపథ్యంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధార పడుతున్నారు.అయితే బిళ్ళ గన్నేరు ఆకులు సహజంగానే తెల్ల జుట్టును నల్లగా( Black Hair ) మారుస్తాయి.

అందుకోసం మనం వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Billa Ganneru, Black, Care, Care Tips, Healthy, Herbal, Remedy, Latest, W

ముందుగా మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల నుంచి బిళ్ళ గన్నేరు ఆకులను సేకరించి వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో బిళ్ళ గన్నేరు ఆకులు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్,( Coconut Oil ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు ప‌ట్టించి ఒకటికి రెండుసార్లు బాగా అప్లై చేసుకోవాలి.

Telugu Billa Ganneru, Black, Care, Care Tips, Healthy, Herbal, Remedy, Latest, W

45 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేశారంటే మీ తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.వైట్ హెయిర్ తో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.

అలాగే ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.

మరియు జుట్టు రాలే సమస్య సైతం దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube