అరటిపండు కనిపించిన ప్రదేశంలో ఎలుకలు అస్సలు ఉండవు...

చాలా సంవత్సరాల నుండి ఇళ్ళ లో ఎలుకల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు.ఎలుకల వల్ల తమ ఇంట్లోని ఆహార పదార్థాలను కాపాడుకోవడానికి ఎన్నో ఉపాయాలను ఆలోచిస్తూ ఉంటారు.

 Reason Behind Male Mice Afraid Of Bananas,male Mice,bananas, Rats,rats Problem,t-TeluguStop.com

ఎలుకలు మన ఇంట్లో ఉంటే వాటిని బయటకి పంపడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.ఎలుకలను ఇంట్లో నుండి బయటకు పంపడానికి చాలా రకాల చిట్కాలను అనుసరిస్తూ ఉంటాం.

అయితే అరటిపండును చూస్తే ఎలుకలు అక్కడి నుంచి భయపడి పరుగు తీస్తాయని మీకు తెలుసా.అవును మరి అరటి పండ్ల నుంచి వచ్చే ఆ వాసన ఎలుకలకి అస్సలు ఇష్టం ఉండదు.

అందుకే ఎలుకలు అక్కడి నుంచి పారిపోతాయని ఒక పరిశోధనలో తెలిసింది.అరటిపండు వాసనను చూస్తే ఎలుకలు ఒత్తిడికి గురవుతాయని వాటిలో ఒక రకమైన హార్మోన్ విడుదలవుతుందని పరిశోధనలు తెలిపాయి.

Telugu Banana, Bananas, Male, Rats, Rats Problem, Telugu, Tips Rats-Latest News

అరటిపండు వాసనలో N-పెంటైల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉంటుంది.దీని కారణంగా ఎలుకల లో ఆందోళన మొదలై అవి అక్కడి నుంచి దూరంగా పారిపోతాయని పరిశోధనలు రుజువు చేశాయి.ఇలా పారిపోయేది మగ ఎలుకలు మాత్రమే.ఎందుకంటే ఆ అరటి పండులో నుంచి వచ్చే వాసన ఆడ ఎలుకల మూత్రం లో ఉండే వాసన ఒకేలా ఉంటుందట.

మగ ఎలుకల నుండి ఆడ ఎలుకలు తమ పిల్లల్ని కాపాడుకోవడానికి ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయట.

ఈ వాసన మగ ఎలుకల్లో ఒత్తిడిని పెంచి వాటిని అటువైపు వెళ్ళకుండా చేస్తుంది.

అయితే ఆడ ఎలుకలు మాత్రం అరటిపండును బాగా ఇష్టపడి తింటాయట.క్యూబెక్ లోని మేక్ గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని పరిశోధనలు చేసి కనుక్కున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube