కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!

మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పానీయాల్లో కొబ్బరినీళ్లు( Coconut Water ) ముందు వరుసలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచడంలో కూడా తోడ్పడతాయి.ముఖ్యంగా కొబ్బరి నీళ్లల్లో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు కలిపి రాశారంటే మీ ముఖం మరింత అందంగా, ప్రకాశవంతంగా మెరిసిపోవడం ఖాయం.

 Try This Masks With Coconut Water For Glowing Skin Details, Coconut Water, Glow-TeluguStop.com

రెమెడీ 1:

కొబ్బరి నీళ్లు మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటుంది.ఇవి మీ చర్మాన్ని మృదువుగా( Soft Skin ) చేయడమే కాకుండా తాజా అనుభూతిని కలిగిస్తాయి.అందుకోసం ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో అర కప్పు ఫ్రెష్ కొబ్బరి నీళ్ళు మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి బాగా షేక్ చేసి ముఖానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

త‌ద్వారా స్కిన్ డ్రై అవ్వ‌కుండా హైడ్రేట్ గా ఉంటుంది.

Telugu Aloevera Gel, Tips, Besan, Coconut, Coffee Powder, Face Masks, Skin, Late

రెమెడీ 2:

ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్లు కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టీ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు మూడు టేబుల్ స్పూన్ల కోకోనట్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని పది నిమిషాలు పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మంపై మురికి, మృత కణాలు తొలగిపోతాయి.వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా పోయి చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

Telugu Aloevera Gel, Tips, Besan, Coconut, Coffee Powder, Face Masks, Skin, Late

రెమెడీ 3:

ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా కొబ్బరినీళ్లు వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.ఇలా చేయడం వల్ల చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మచ్చలు ఏమైనా ఉన్న కూడా క్రమంగా మాయమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube