మన భారతదేశంలో ఉసిరి చెట్టును ఒక పవిత్ర చెట్టుగా భావిస్తారు.ఉసిరి చెట్టు నుంచి వచ్చే పండ్లు, ఆకులు, బెరడు, వేర్లు అన్నీ ఆయుర్వేదంలో ఔషధాలుగా ఉపయోగిస్తారు.
ప్రస్తుత చలికాలంలో ఉసిరి కాయలు( Amla ) విరివిగా లభ్యమవుతుంటాయి.ఉసిరికాయలతో తయారు చేసే నిల్వ పచ్చడి చాలా మందికి మోస్ట్ ఫేవరెట్.
పికిల్ గురించి పక్కన పెడితే ఉసిరికాయల్లో మన ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.రోజుకు ఒక ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒక చిన్న ఉసిరికాయలో దాదాపు ఇరవై ఫలాలను తినేంత విటమిన్ సి( Vitamin C ) ఉంటుంది.నారింజ కంటే 8 రెట్లు ఎక్కువ విటమిన్ సి ను మనం ఉసిరికాయ ద్వారా పొందొచ్చు.నిత్యం ఒక ఉసిరి కాయను తింటే అందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని( Immunity Power ) పెంచి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.మలబద్ధకంతో( Constipation ) బాధపడేవారికి ఉసిరికాయ ఒక న్యాచురల్ మెడిసిన్‌లా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరికాయ పేగుల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తరిమికొడుతుంది.
మధుమేహం( Diabetes ) ఉన్నవారు కూడా రొజుకొక ఉసిరికాయను తినొచ్చు.ఉసిరిలో ఉండే క్రోమియం పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.అలాగే రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉసిరికాయలకు ఉన్నాయి.
రెగ్యులర్ డైట్ లో వాటిని చేర్చుకుంటే రక్తం శుభ్రపడటంతో పాటుగా శరీరంలోని టాక్సిన్లు కూడా తొలగిపోతాయి.వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఉసిరికాయలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఉసిరి మెటబాలిజాన్ని పెంచుతుంది, ఇది శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతంగా చేసి బరువును తగ్గించడానికి మద్దతు ఇస్తుంది.
అంతేకాకుండా రోజుకొక ఉసిరి కాయను తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు పుష్టిని ఇస్తాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
పైగా నిత్యం ఉసిరి కాయను తినడం వల్ల చర్మానికి తేజస్సు వస్తుంది.స్కిన్ ఏజింగ్ కూడా ఆలస్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.