తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలకు కొదువ లేదు.ఎంతో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో.
అయితే ఎంత పేరు, ప్రఖ్యాతలు ఉన్నాగాని కొందరి స్టార్స్ విషయంలో మాత్రం వాళ్ళ కూతుళ్ళ విషయంలో విబేధాలు వచ్చాయి.సాధారణంగా తండ్రి కూతుళ్ళకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు.
కానీ కొన్నిసార్లు పబ్లిక్ గా తండ్రులను ఎదిరించిన కూతుళ్లు కూడా ఉన్నారు.అయితే సామాన్య ప్రజల విషయంలో ఇలాంటివి జరిగినా కానీ సెలబ్రిటీ విషయానికి వస్తే కొంచెం స్పెషల్ అనే చెప్పాలి.
మరి టాలీవుడ్ లో మీడియా సాక్షిగా తండ్రులను ఎదిరించిన కూతుళ్ళ ఎవరో తెలుసుకుందాం.!
ఈ లిస్ట్ లో మొదటగా రామ్ గోపాల్ వర్మ ఉంటారు.
ఆయన పేరు చెబితే చాలు కన్నకూతురు ఏంటి కట్టుకున్న భార్య, ప్రేక్షకులతో సహా అందరు వ్యతిరేకిస్తారు.అలాంటి ఒక సంఘటన రామగోపాల్ వర్మ కూతురు విషయంలో జరిగింది.
అది కూడా సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ సాక్షిగా ఈ రచ్చ అంతా జరిగింది.స్వతహాగా పవన్ కళ్యాణ్ అంటే ఎవరయినా అభిమానిస్తారు.అలాగే రాంగోపాల్ వర్మ కూతురు కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించింది.పవన్ కళ్యాణ్ ని ఎవరైనా ఒక మాట అన్నగాని రామ్ గోపాల్ వర్మ కూతురు ఊరుకునేది కాదు.
కానీ తండ్రి ఏమో పని కట్టుకుని మరి పవన్ కళ్యాణ్ ని అలాగే మెగా ఫ్యామిలీ ని ఎదో ఒకరకంగా విమర్శిస్తూ ఉంటాడు.ఒక సమయంలో ఇదే విషయంలో ట్విట్టర్ వేదికగా తండ్రి కూతుళ్లు ఇద్దరు కూడా గొడవ పడ్డారు.
ఎదుట ఉన్న వ్యక్తి తన తండ్రి అని కూడా చూడకుండా.నువ్వు ఎలా అయినాగానీ ఉండు కానీ మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని వర్మ కి ట్విట్టర్ వేదికగా కూతురు వార్నింగ్ కూడా ఇచ్చింది.
వర్మ ఏమో తన రూట్ మార్చుకోడు.కూతురేమో తండ్రికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ని అభిమానించే అభిమాని అవ్వడం గమనార్హం.
అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ లెవెల్ కి ఎదిగిన వ్యక్తి చిరంజీవి.అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీలో కూడా ఈలాంటి ఒక సంఘటన జరిగింది.మెగాస్టార్ చిన్న కూతురు అయిన శ్రీజ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.మీడియా సాక్షిగా నాకు నా భర్తకి నాఫ్యామిలీ మెంబెర్స్ నుంచి అపాయం వచ్చే అవకాశం ఉంది మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ మీడియాలో పబ్లిక్ గా చెప్పింది.
అలాగే టీవీలో, పోలీస్ స్టేషన్లో కూడా రచ్చ రచ్చ చేసింది.కానీ మళ్ళీ కొన్ని రోజులకే మా నాన్న బంగారం అంటూ తండ్రి చెంతకే చేరింది.
అలాగే నా తండ్రి వల్లే నాకు ప్రాణ హాని ఉందని, డబ్బు సంపాదించే మిషన్ లా నన్ను చూస్తున్నారని ఆర్తీ అగర్వాల్ ఒకసారి ఆత్మ హత్యా ప్రయత్నం కూడా చేసింది.అయితే అప్పట్లో తాను ప్రేమించిన తరుణ్ మోసం చేసాడనే, ఆత్మహత్య చేసుకుందని అందరు అనుకున్నారు.కానీ అసలు నిజం అదికాదు ఆర్తీ అగర్వాల్ తండ్రి తన కూతురుని కంట్రోల్ చేయాలనీ అనుకోవడమే ఆత్మహత్యకి కారణమట.కెరీర్ మంచి గాడిలో నడుస్తున్న సమయంలో ఎక్కడ కూతురు పెళ్లి చేసుకుంటుందో అనే భయంతో ఆర్తీ తండ్రి తనని కంట్రోల్ చేయాలనీ భావించాడట.
తండ్రి తన మీద పెత్తనం చేయడాన్ని భరించలేక ఒకానొక సందర్భంలో మెట్ల మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఆ సమయంలో ఆర్తీ తలకి పెద్ద దెబ్బ కూడా తగిలింది.
అయితే ఎన్నో బాధలు పడిన ఆర్తీ జీవితం అర్ధాంతరంగానే ముగిసిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.
అలాగే నా తండ్రి పెద్ద తాగుబోతు అని, డ్రగ్స్ కి బానిస అయ్యాడు.నా తల్లికి మందు అలవాటు చేసి ఆ మత్తులో ఆస్థి మొత్తం రాయించుకుని నాకు అన్యాయం చేసాడని ఎప్పుడు వార్తలకి ఎక్కుతుంది వనితా విజయ్ కుమార్.ఆమె తండ్రి పై చేసే ఆరోపణల్లో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తనకే తెలుసు.
చివరికి వనిత లాంటి ఆడపిల్ల పర్యవేక్షణలో పెరిగితే ఆమె కొడుకు కూడా ఎందుకు పనికి రాకుండా పోతాడని కోర్టు ఆ పిల్లాడి బాధ్యతని విజయ్ కుమార్ కి ఇచ్చింది.పైగా ఈ కుటుంభంలో పేరు మోసిన నటులు అరడజను పైగానే ఉన్నారు.
అయినాగానీ ఒక పద్ధతి పాడు లేకుండా ఎప్పుడు ఎదో ఒక విషయంలో వార్తల్లో ఉంటారు.కొంత మంది స్టార్స్ విషయంలో ఇలాంటి సంఘటనలు బయటకి వచ్చాయి.కానీ చాలామంది సెలెబ్రిటీలు మాత్రం ఇంటి గుట్టుని బయటకి రానివ్వకుండా సర్దుబాటు చేస్తూ ఉంటారు.అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఇలాంటివి ఎన్ని చెప్పినా సరిపోవు.!!
.