1.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.నేటి నుంచి రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి వేలం
హైదరాబాద్ బండ్లగూడ పోచారం లోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి వేలం ఈరోజు నుంచి మొదలైంది.లాటరీ పద్ధతిలో ప్లాట్ల ను కేటాయించనున్నారు.
3.బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సాయం
కర్ణాటక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.
4.ప్రతిపక్షాలు అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు
రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం పార్లమెంట్ లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
5.అమ్మబడి నిధులను విడుదల చేసిన జగన్
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మ వడి పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు.
6.జూలై 6 నుంచి బహిరంగ మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు
తెలంగాణలో జూలై 6 నుంచి బహిరంగ మార్కెట్ లోకి పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణల సంచాలకులు శ్రీనివాసాచారి తెలిపారు.
7.సంజయ్ రౌత్ కు ఈడి నోటీసులు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
8.నో బ్యాగ్ డే
వచ్చేనెల 5 నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వారంలో ఒకరోజు నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
9.డిజిపికి టీడీపీ ఫిర్యాదు
టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పై వైసిపి నాయకులు రోజా, వెంకట్రావు చేసిన విమర్శలపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బిజెపికి టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు
10.అగ్నిపత్ ను తక్షణమే విరమించుకోవాలి : బట్టి విక్రమార్క
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్ని పత్ ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
11.అన్నవరంలో నేడు డైల్ యువర్ ఈవో
నేడు అన్నవరం సత్య దేవుని ఆలయంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు.
12.అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ఆందోళనలు
అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా నేడు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.
13.మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై నేడు సుప్రీంలో విచారణ
మహారాష్ట్ర లో రాజకీయ సంక్షోభం పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
14.ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
15.బీజేపీ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం
భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలకు సంబంధించిన కార్యాచరణలో భాగంగా హెచ్ఐసీసీలో బిజెపి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.
16.రేవంత్ రెడ్డి కామెంట్స్
జవాన్లను అవమానించే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రవంత్ రెడ్డి విమర్శించారు.
17.బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ని తిరస్కరిస్తున్నాం : కేటీఆర్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సినిమాకు టిఆర్ఎస్ మద్దతు ఇస్తుందని బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిని తాము తిరస్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
18.రాజేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు
సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
19.చంద్రబాబు కామెంట్స్
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పెరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,650 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,980
.