బెల్లంకొండ బ్రదర్స్‌ పై మళ్లీ మొదలు అయిన ట్రోల్స్‌

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆయన నిర్మాణంలో చాలా సినిమా లు వచ్చాయి.

 Bellamkonda Brothers Trolls On Social Media ,  Bellamkonda Movie ,  Bellamkonda-TeluguStop.com

వాటిల్లో చాలా సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.గత కొన్నాళ్లు గా సినిమా నిర్మాణంకు కాస్త దూరంగా ఉంటున్న బెల్లంకొండ సురేష్ తన ఇద్దరు కొడుకులను హీరోలుగా చేశాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.హిందీ సినిమా లో ప్రస్తుతం నటిస్తున్నాడు, మరో వైపు చిన్నబ్బాయి బెల్లంకొండ సాయి గణేష్‌ స్వాతి ముత్యం సినిమా తో హీరో గా ఎంట్రీ కి సిద్ధం అయ్యాడు.

మొదటి హీరో సాయి శ్రీనివాస్ కు ఇప్పటి వరకు యాక్టింగ్‌ రాదు అంటూ విమర్శించే వారు చాలా మంది ఉన్నారు.ఇదే సమయంలో బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతి ముత్యం సినిమా నుండి టీజర్ వచ్చింది.

టీజర్ లో సాయి గణేష్‌ ఏమాత్రం ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేక పోయాడు.అన్ని సన్నివేశాలకు కూడా ఒకే ఎక్స్‌ ప్రెషన్ ఇస్తున్నాడు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి.మరీ యాక్టింగ్‌ స్కూల్‌ కు కూడా వెళ్లకుండా సినిమా ల్లోకి వచ్చావా బాబు అంటూ చాలా మంది గణేష్ టీజర్ కు కామెంట్స్ చేస్తున్నారు.ఈయన సినిమాల్లో రాణించడం ఎంత వరకు సాధ్యమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇప్పట్లో ఈయన సినిమాల్లో సక్సెస్‌ అయ్యేది కష్టమే అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

కాని ఆయన సినిమా కు వస్తున్న పాజిటివ్ బజ్.ముఖ్యంగా టైటిల్‌ కు వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్ తో ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందనే అంటున్నారు.

సినిమా విజయం సాధించినా కూడా ఆయన యాక్టింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సిందే అనేది కొందరి అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube