మెహబూబా( Mehbooba ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ముద్దుగుమ్మ నేహా శెట్టి( Neha Shetty ).ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ అమ్మడు గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి.
మెహబూబా సినిమా కన్నా ముందు కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా తొలిసారి నేహా శెట్టి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది.ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించడానికి సరిపడా సినిమాలు చేస్తూ వెళుతుంది.
మరి నేహా శెట్టి గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుసుకోవాల్సిన ఆ పది విషయాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నేహా శెట్టి చాక్లెట్ గర్ల్( Chocolate Girl ) అనే ఒక యూట్యూబ్ వీడియో ద్వారా వైరల్ గా మారింది ఈ వీడియోకి మూడు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.మెహబూబా సినిమా తర్వాత న్యూయార్క్ వెళ్ళిపోయిన నేహా ఆరు నెలల పాటు యాక్టింగ్ లో శిక్షణ తీసుకుందట.నేహా శెట్టి తండ్రి బిజినెస్ మాన్ అలాగే తల్లి డెంటిస్ట్ గా ఉన్నారట.
నేహా శెట్టి కి ఒక చెల్లి కూడా ఉంది.ఆ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ గా సెటిల్ అయిందట.
మంగళూరులో పుట్టిన నేహా శెట్టి పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిజీగా మారిపోయింది.ఇక మూడవ తరగతి చదువుతున్న సమయంలోనే హార్లిక్స్, కిసాన్ జాం వంటి యాడ్స్ చేసి చైల్డ్ ఆర్టిస్ట్ అని అనిపించింది.

ఇక నేహా శెట్టి మోడలింగ్ లోకి ప్రవేశించి మిస్స్ మంగుళూరు( Miss Mangalore ) గా విజేత గా నిలిచింది.అలాగే మిస్ సౌత్ ఇండియా రేస్ లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.ప్రస్తుతం నేహా శెట్టి పారితోషకం విషయానికి వస్తే ఆమె ఒక్కో చిత్రానికి గాను 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుంది.ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విజయానికి వస్తే ఈ చిత్రానికి ఆమె సొంతంగా మొదటిసారి డబ్బింగ్ చెప్పకూడని విశేషం తనకు ఎంతో ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని చెబుతోంది.
ఇక హ్రితిక్ రోషన్ నీ ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చిందట నేహా శెట్టి.